×
Ad

T20 World Cup 2026 : ఏం జరిగినాసరే.. టీ20 వరల్డ్ కప్‌లో భారత్‌తో ఆడబోం.. పాకిస్తాన్ ప్ర‌ధాని సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న!.. కారణం అదేనట..

T20 World Cup : టీ20 వరల్డ్ కప్ టోర్నీలో భాగంగా భారత్ జట్టుతో జరిగే మ్యాచ్‌ను పాకిస్థాన్ క్రికెట్ బోర్డు బహిష్కరించినట్లు వార్తలు వచ్చాయి. అయితే, ఈ విషయంపై తాజాగా ఆ దేశ ప్రధాని షెహబాజ్ షరీఫ్ స్పందించారు.

Pak PM Shehbaz Sharif

T20 World Cup 2026 : భారత్, శ్రీలంక వేదికగా ఈనెల 7వ తేదీ నుంచి టీ20 వరల్డ్ కప్ టోర్నీ ప్రారంభం కానుంది. అయితే, ఈ టోర్నీలో భారత్ జట్టుతో జరిగే మ్యాచ్‌ను పాకిస్థాన్ క్రికెట్ బోర్డు బహిష్కరించినట్లు వార్తలు వచ్చాయి. అయితే, ఈ విషయంపై ఆ దేశ ప్రధాని షెహబాజ్ షరీఫ్ స్పందించారు. పాకిస్థాన్ జట్టు భారత్‌తో మ్యాచ్ ఆడదని ఆయన స్పష్టం చేశారు.

Also Read : U19 World Cup 2026 : సెమీస్‌లో వైభ‌వ్ విధ్వంసం.. అఫ్గాన్ బౌల‌ర్ల‌కు ప‌ట్ట‌ప‌గ‌లే చుక్క‌లు..

ఇస్లామాబాద్‌లో జరిగిన ఫెడరల్ క్యాబినెట్ ను ఉద్దేశించి ఆ దేశ ప్రధాని షెహబాజ్ షరీఫ్ మాట్లాడుతూ.. మేం టీ20 వరల్డ్ కప్ లో భారత జట్టుతో మ్యాచ్ ఆడబోమనే విషయంలో చాలా క్లారిటీతో నిర్ణయం తీసుకున్నాం. క్రీడల్లో రాజకీయాలు ఉండకూడదు. మేం సరైన నిర్ణయమే తీసుకున్నామని అన్నారు. అయితే, బంగ్లాదేశ్ కు సంఘీభావం తెలిపే క్రమంలో పాకిస్థాన్ జట్టు ఈ మ్యాచ్ ఆడకూడదని నిర్ణయించుకుందని ప్రధాని చెప్పినట్లు పాకిస్థాన్ జాతీయ మీడియా పేర్కొంది.

టీ20 వరల్డ్ కప్ షెడ్యూల్ ప్రకారం.. ఫిబ్రవరి 15వ తేదీన శ్రీలంక రాజధాని కొలంబోలోని ప్రేమదాస స్టేడియం వేదికగా ఇండియా వర్సెస్ పాకిస్థాన్ జట్ల మధ్య గ్రూప్ దశ మ్యాచ్ జరగాల్సి ఉంది. పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ తాజా ప్రకటనతో ఈ మ్యాచ్ పై అనిశ్చితి నెలకొంది.

ఇదిలాఉంటే.. పాకిస్థాన్ నిర్ణయాన్ని అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) తప్పుబట్టింది. ఇది క్రీడాస్ఫూర్తికి విరుద్ధమని, ఎంపిక చేసిన మ్యాచ్ లు మాత్రమే ఆడతామనడం సమంజసం కాదని పేర్కొంది. అయినా పాకిస్థాన్ తన మొండివైఖరిని వీడటం లేదు. తాజా పరిణామాల నేపథ్యంలో పాకిస్థాన్ క్రికెట్ బోర్డుపై ఐసీసీ ఎలాంటి ఆంక్షలు విధించే అవకాశముంది.. ఏం నిర్ణయం తీసుకుంటుందనే క్రికెట్ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.