Virat Kohli : కోహ్లి కోసమే వచ్చా.. నా గుండె పగిలిపోయిందన్న పాక్ యువతి.. వీడియో వైరల్
రికార్డుల రారాజు, పరుగుల యంత్రం విరాట్ కోహ్లి (Virat Kohli) కి ఉన్న ఫ్యాన్ పాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. దేశంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా కింగ్ కోహ్లికి అభిమానులు ఉన్నారు.
- Thota Vamshi Kumar
- Updated on- September 3, 2023 / 09:02 PM IST
Pakistani cricket fan adores Virat Kohli
Virat Kohli fan: రికార్డుల రారాజు, పరుగుల యంత్రం విరాట్ కోహ్లి (Virat Kohli) కి ఉన్న ఫ్యాన్ పాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. దేశంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా కింగ్ కోహ్లికి అభిమానులు ఉన్నారు. పాకిస్తాన్‌లోనూ చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. ప్రస్తుతం ఆసియా కప్ (Asia Cup) 2023 జరుగుతోంది. శనివారం పాకిస్తాన్‌తో భారత జట్టు తలపడింది. భారత ఇన్నింగ్స్ ముగిసిన తరువాత వర్షం రావడంతో అంపైర్లు మ్యాచ్‌ను రద్దు చేసిన సంగతి తెలిసిందే.
ఇదిలా ఉంటే.. ఈ మ్యాచ్ చూసేందుకు పాకిస్తాన్‌కు చెందిన ఓ యువతి శ్రీలంకలోని పల్లెకలె స్టేడియానికి వచ్చింది. నేరుగా కోహ్లిని చూసి ఎంతో సంబరపడిపోయింది. అయితే ఈ మ్యాచ్‌లో విరాట్ 4 పరుగులకే ఔట్ అయ్యాడు. దీంతో ఆ యువతి నిరాశ చెందింది. ప్రస్తుతం ఆ యువతి విరాట్ కోహ్లి గురించి మాట్లాడిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
Asia Cup 2023 : భారత్, పాకిస్తాన్ మ్యాచ్‌లో ప్రభాస్ పాట.. బౌండరీ కొట్టిన ప్రతిసారి..!
ఆ వీడియోలో ఏం ఉందంటే.. ‘నేను విరాట్ కోహ్లికి పెద్ద అభిమానిని. అతడిని చూడాలని భారత్, పాకిస్తాన్ మ్యాచ్‌కు వచ్చాను. అయితే.. విరాట్ శతకం చేయకపోవడంతో నేను నిరాశ చెందా. కోహ్లి తొందరగా ఔట్ కావడంతో నా గుండె పలిగిపోయింది.’ అని ఆ యువతి చెప్పింది. మీరు ఎవరికి సపోర్టు చేస్తారని చెప్పగా.. పాకిస్తాన్‌కే అని అంది. మరీ బాబర్ ఆజామ్, విరాట్ కోహ్లిలలో ఫేవరెట్ ఎవరు అని ప్రశ్నించగా ఎలాంటి తడబాటు లేకుండా కోహ్లి అని అంది.
