Pakistani Anchor Felldown: అయ్యయ్యో.. యాంకర్‌ను కిందపడేసిన క్రికెటర్.. సోషల్ మీడియాలో నవ్వులు పూయిస్తున్న వీడియో..
సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో భాగంగా బుధవారం ముంబై ఇండియన్స్ కేప్‌టౌన్ వర్సెస్ సన్ రైజర్స్ ఈస్టర్న్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ సమయంలో బౌండరీవైపు దూసుకెళ్తున్న బాల్‌ను అడ్డుకొనేందుకు ఇద్దరు ఫీల్డర్లు పరుగెత్తారు. వీరిలో ఒకరు జారుకుంటూ వెళ్లి బౌండరీ లైన్ వెలుపల కోచ్‌ను ఇంటర్వ్యూ చేస్తున్న పాకిస్థాన్ యాంకర్ ను బలంగా ఢీకొట్టాడు. ఆమె ఒక్కసారిగా కిందపడిపోయింది. వెంటనే తేరుకొని పైకి లేచింది. ఇందుకు సంబంధించిన ఫన్నీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
- Harishth Thanniru
- Published On : January 19, 2023 / 11:43 AM IST
Pakistani anchor Zainab
Pakistani Anchor Felldown: క్రికెట్ మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఫన్నీ సంఘటనలు తరచూ కనిపిస్తుంటాయి. ఇలాంటి తరహా ఘటన సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో చోటు చేసుకుంది. ఫీల్డింగ్ సమయంలో బౌండరీ లైన్ దాటిన క్రికెటర్ యాంకర్‌ను ఢీకొట్టారు. దీంతో ఆమె ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. వెంటనే తేరుకొని పైకిలేచింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు ఫన్నీ కామెంట్లతో స్పందిస్తున్నారు.
Video Viral: కింద పడిపోబోయిన కప్పును పట్టుకున్న కానె విలియమ్సన్.. ఇక ఆ కప్పు తమదేనంటూ..
సౌతాఫ్రికా టీ20 లీగ్ జరుగుతుంది. ఈ లీగ్‍లో భాగంగా బుధవారం ముంబై ఇండియన్స్ కేప్‌టౌన్ వర్సెస్ సన్ రైజర్స్ ఈస్టర్న్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ సమయంలో ఈ సరదా సన్నివేశం చోటు చేసుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై కేంప్‌టౌన్ జట్టు సన్‌రైజర్స్ కు 172 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన సన్‌రైజర్స్ ఆటగాళ్లు వరుస బౌండరీలు కొట్టారు. 13వ ఓవర్ ఎంఐ కేప్‌టౌన్ జట్టు బౌలర్ సామ్ కరన్ బౌలింగ్ వేశాడు. ఆ ఓవర్లో చివరి బంతికి మార్కో జాన్సన్ డీప్ వికెట్ మీదుగా బౌండరీవైపు బాల్‌ను తరలించాడు. ఇద్దరు ఫీల్డర్ల మధ్యలో బాల్ వెళ్తున్న క్రమంలో వారిద్దరు ఆ బంతిని బౌండరీలైన్ తాకకుండా ఆపేందుకు వేగంగా పరుగు పెట్టారు.
ఆ సమయంలో బౌండరీ లైన్ ఆనుకొని పాకిస్థాన్‌కు చెందిన ప్రముఖ స్పోర్ట్స్ యాంకర్ జైనాబా అబ్బాస్ కోచ్‌ను ఇంటర్వ్యూ చేస్తోంది. బౌండరీలైన్ వైపు ఫీల్డర్లు పరుగెత్తుకుంటూ వచ్చే విషయాన్ని వారు గమనించలేదు. వేగంగా వచ్చిన ఫీల్డర్ జారుకుంటూ యాంకర్ జైనాబ్ కాళ్లను ఢీకొట్టాడు. ఆమె ఒక్కసారిగా కిందపడిపోయింది. ఊహించని ఘటనతో కంగుతిన్న ఆమె వెంటనే తేరుకొని కోచ్ సహాయంతో పైకిలేచింది. ఆమెకు ఎలాంటి గాయాలు కాలేదు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో నెటిజన్లకు నవ్వులు తెప్పిస్తోంది. అయితే ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్ జట్టు విజయం సాధించింది.
