Paris Olympic 2024 : ఒలింపిక్స్‌లో ఇవాళ భారత్‌కు రెండు కీలక ఈవెంట్లు.. పతకాల పంట పండేనా..? నేటి పూర్తి షెడ్యూల్ ఇలా

పారిస్ వేదికగా ఒలింపిక్స్ -2024 క్రీడలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. తొలిరోజు భారత్ అథ్లెట్లు పలు విభాగాల్లో ఆడారు

Paris Olympic 2024 : ఒలింపిక్స్‌లో ఇవాళ భారత్‌కు రెండు కీలక ఈవెంట్లు.. పతకాల పంట పండేనా..? నేటి పూర్తి షెడ్యూల్ ఇలా

PV Sindhu and Manu bhaker

India All Events Schedule In Paris Olympic : పారిస్ వేదికగా ఒలింపిక్స్ -2024 క్రీడలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. తొలిరోజు భారత్ అథ్లెట్లు పలు విభాగాల్లో ఆడారు. అయితే, ఆశించిన స్థాయిలో రాణించలేక పోయారు. యువ షూటర్ మను బాకర్ మాత్రం అదరగొట్టింది. మిగిలిన సహచరులంతా విఫలమైన వేళ ఆమె చక్కని ప్రదర్శనతో ఫైనల్ కు దూసుకెళ్లింది. బ్యాడ్మింటన్ లో సాత్విక్ సాయిరాజ్ -చిరాగ్ శెట్టి, లక్ష్య సేన్ శుభారంభం చేశారు. భారత హాకీ జట్టు విజయంతో పతక వేటును మొదలు పెట్టింది. రెండోరోజు ఆదివారం భారత్ ను రెండు పతకాలు ఊరిస్తున్నాయి. ఇప్పటి దాకా భారత్ కు పతకం లేని ఆర్చరీలో బోణీ కొట్టేందుకు మహిళల జట్టు ముందు అద్భుత అవకాశం నిలవగా.. షూటింగ్ లో మను బాకర్ పతక ఈవెంట్లో పోటీ పడనుంది.

Also Read : Paris Olympics 2024 : ఒలింపింక్స్‌లో భారత్ బోణీ.. న్యూజిలాండ్‌పై 3-2 తేడాతో పురుషుల హాకీ జట్టు గెలుపు!

2020 ఒలింపిక్స్ లో భారీ అంచనాల మధ్య మూడు విభాగాల్లో పోటీపడి నిరాశపర్చిన యువ షూటర్ మను బాకర్.. ప్రస్తుతం పారిస్ వేదికగా జరుగుతున్న పోటీల్లో అంచనాలకు తగ్గట్లుగా రాణించారు. తొలి ఈవెంట్లోనే ఫైనల్ కు చేరిన మను బాకర్ పతకం మీద ఆశలు రేపింది. మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ లో మూడో స్థానంతో తుది పోరుకు అర్హత సాధించిన మను.. ఇవాళ ఫైనల్ ఆడబోతోంది. క్వాలిఫికేషన్ జోరును ఫైనల్లోనూ కొనసాగిస్తే ఆమె ఖాతాలో పతకం పడబోతున్నట్లే. అదేవిధంగా మను బాకర్ మరో రెండు విభాగాల్లోనూ పోటీ పడనుంది. మరోవైపు ఇవాళ భారత్ బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సిందు ఒలింపిక్స్ లో తన పోరును ప్రారంభించనుంది.

Also Read : Paris Olympics Event : ఈ పారిస్ ఒలింపిక్స్ ఈవెంట్‌లో పోటీపడనున్న బిల్‌ గేట్స్ అల్లుడు నయెల్ నాసర్!

పారిస్ ఒలింపిక్స్‌లో ఇవాళ భారత్ అథ్లెట్ల షెడ్యూల్ ..
టేబుల్ టెన్నిస్ ..
మహిళల సింగిల్స్ (2వ రౌండ్): శ్రీజ అకుల vs క్రిస్టినా కల్బెర్గ్ (స్వీడన్) – 12.15 PM
మహిళల సింగిల్స్ (2వ రౌండ్): మనిక బాత్రా vs అన్నా హెర్సీ (గ్రేట్ బ్రిటన్) – 12.15 PM
పురుషుల సింగిల్స్ (2వ రౌండ్): శరత్ కమల్ vs డెన్నీ కోజుల్ ( స్లోవేనియా) – 3.00 pm

స్విమ్మింగ్ విభాగంలో..
పురుషుల 100మీ బ్యాక్‌స్ట్రోక్ (హీట్ 2): శ్రీహరి నటరాజ్ – మధ్యాహ్నం 3.16 గంటలకు
మహిళల 200 మీటర్ల ఫ్రీస్టైల్ (హీట్ 1): ధినిధి దేశింగు – మధ్యాహ్నం 3.30

ఆర్చరీ విభాగంలో..
మహిళల జట్టు (క్వార్టర్ ఫైనల్స్): భారత్ (అంకిత భక్త, భజన్ కౌర్ మరియు దీపికా కుమారి) vs ఫ్రాన్స్/నెదర్లాండ్స్ – సాయంత్రం 5.45
మహిళల జట్టు (సెమీ ఫైనల్స్): రాత్రి 7.17
మహిళల జట్టు (పతక దశ మ్యాచ్‌లు): రాత్రి 8.18

బ్యాడ్మింటన్ విభాగంలో..
మహిళల సింగిల్స్ (గ్రూప్ స్టేజ్): PV సింధు vs FN అబ్దుల్ రజాక్ (మాల్దీవులు), 12:50 PM
పురుషుల సింగిల్స్ (గ్రూప్ స్టేజ్): HS ప్రణయ్ vs ఫాబియన్ రోత్ (జర్మనీ), 8 PM

షూటింగ్ విభాగంలో..
మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ అర్హత: ఎలవెనిల్ వలరివన్, మధ్యాహ్నం 12.45 గంటలకు
పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ అర్హత: సందీప్ సింగ్ మరియు అర్జున్ బాబుటా, మధ్యాహ్నం 2.45 గంటలకు
మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఫైనల్: మను భాకర్, మధ్యాహ్నం 3.30

రోయింగ్ విభాగంలో..
పురుషుల సింగిల్స్ స్కల్ (రెపిఛేజ్ 2): బల్‌రాజ్ పన్వార్, మధ్యాహ్నం 1.18

బాక్సింగ్ విభాగంలో..
మహిళల 50 కేజీల తొలి రౌండ్ (నిఖత్ వర్సెస్ మ్యాక్సీ కరీన) మధ్యాహ్నం 3.50 గంటలకు.

స్విమ్మింగ్ లో పురుషుల 400 మీటర్ల వ్యక్తిగత మెడ్లె ఫైనల్ : రాత్రి 12గంటలకు.
మహిళల 100 మీటర్ల బటర్ ప్లై ఫైనల్ : రాత్రి 12.10 గంటలకు.
పురుషుల 100 మీటర్ల బ్రెస్ట్ స్ట్రోక్ ఫైనల్ : రాత్రి 12.50గంటలకు