Paris Olympics 2024 : ఒలింపింక్స్‌లో భారత్ బోణీ.. న్యూజిలాండ్‌పై 3-2 తేడాతో పురుషుల హాకీ జట్టు గెలుపు!

Paris Olympics 2024 : పారిస్ ఒలింపిక్స్‌లో భారత్ 3-2తో న్యూజిలాండ్‌ను ఓడించి ఉత్కంఠభరితమైన గేమ్‌ను కైవసం చేసుకుంది.

Paris Olympics 2024 : ఒలింపింక్స్‌లో భారత్ బోణీ.. న్యూజిలాండ్‌పై 3-2 తేడాతో పురుషుల హాకీ జట్టు గెలుపు!

Indian Men's Hockey Team Begins Paris Olympics 2024 Campaign ( Image Source : Google )

Updated On : July 28, 2024 / 12:30 AM IST

Paris Olympics 2024 : పారిస్ ఒలింపిక్స్‌లో భారత పురుషుల హాకీ జట్టు బోణీ కొట్టింది. తొలి మ్యాచ్‌లోనే న్యూజిలాండ్‌పై 3-2 తేడాతో గెలిచింది. స్కిప్పర్ హర్మన్ ప్రీత్ సింగ్ అద్భుతమైన ప్రదర్శనతో చివరి నిమిషంలో గోల్ కొట్టడంతో విజయాన్ని కైవసం చేసుకుంది.

న్యూజిలాండ్ జట్టు నుంచి సైమన్ చైల్డ్, శామ్ లేన్ గోల్స్ చేయగా.. భారత్ తరుఫున హర్మన్ ప్రీత్‌, వివేక్ సాగర్, మన్‌దీప్‌ సింగ్ గోల్స్ కొట్టారు. కెప్టెన్ హర్మన్ ప్రీత్, అభిషేక్‌ న్యూజిలాండ్ గోల్స్ కొట్టకుండా అడ్డుకునేందుకు ప్రయత్నించారు. కానీ, న్యూజిలాండ్ ఆరంభం నుంచి దూకుడుగా ఆడింది.

మొదటి క్వార్టర్‌లో సామ్ లేన్ పెనాల్టీ కార్నర్ ద్వారా గోల్ చేయడంతో బ్లాక్ స్టిక్స్ ఆరంభంలోనే విజయం సాధించింది. అయితే, ఆ తర్వాత భారత్ తిరిగి పుంజుకుంది. పెనాల్టీ కార్నర్ నుంచి రీబౌండ్ ఆఫ్‌లో మన్‌దీప్ సింగ్ చేసిన 24వ నిమిషంలో పెనాల్టీ కార్నర్‌‌తో సమం చేసింది.

మూడో క్వార్టర్‌లో వివేక్ సాగర్ ప్రసాద్ గోల్ చేయడంతో భారత్ ఆధిక్యంలోకి వెళ్లింది. ఆఖరి క్వార్టర్‌లో భారత్‌కు సులువైన విజయంగా కనిపించింది. న్యూజిలాండ్ 53వ నిమిషంలో పెనాల్టీ కార్నర్‌లో సైమన్ చైల్డ్ గోల్ చేయడంతో రెండు జట్ల స్కోర్లు సమం అయ్యాయి.

మ్యాచ్‌ ముగింపులో భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్ రెండు నిమిషాల కన్నా తక్కువ సమయం ఉండగానే పెనాల్టీ స్ట్రోక్‌ను సాధించాడు. ఫలితంగా 3-2 తేడాతో న్యూజిలాండ్‌పై భారత్ విజయం సాధించింది. టీమిండియా తదుపరి పూల్ బి మ్యాచ్‌లో సోమవారం (జూలై 29) అర్జెంటీనాతో తలపడనుంది.

Read Also : SL vs IND: ఫస్ట్ టీ20 మ్యాచ్.. శ్రీలంకపై భారత్ ఘన విజయం