PSL 2026 : అరెరె ఇన్నాళ్లు ఈ విషయం తెలియకపాయె.. పీఎస్ఎల్ అంటే పాకిస్థాన్ సూపర్ లీగ్ కాదా.. ‘పెట్రోల్ షార్టేజ్ లీగ్’..
పాకిస్థాన్ సూపర్ లీగ్ (PSL 2026)మార్చి 26 నుంచి ప్రారంభం కానుంది.
- Thota Vamshi Kumar
- Updated on- March 23, 2026 / 12:45 PM IST
PCB Mocked On Social Media After Changes in PSL 2026
- దేశంలో ఇంధన సంక్షోభం
- ఖాళీ స్టేడియాల్లో పీఎస్ఎల్
- సోషల్ మీడియాలో పీసీబీపై ట్రోలింగ్
PSL 2026 : పాకిస్థాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్) మార్చి 26 నుంచి ప్రారంభం కానుంది. అయితే.. మ్యాచ్‌లను మైదానంలో ప్రత్యక్షంగా వీక్షించేందుకు ప్రేక్షకులను అనుమతించడం లేదు. ఖాళీ స్టేడియాల్లోనే మ్యాచ్‌లను నిర్వహించనున్నట్లు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఛైర్మన్ మోసిన్ నఖ్వీ ఆదివారం తెలిపారు. ఇక మ్యాచ్‌లను కూడా కేవలం రెండు వేదికలు.. లాహోర్, కరాచీలకే పరిమితం చేశారు.
పశ్చియాలో యుద్ధం కారణంగా పలు దేశాల్లో చమురు సంక్షోభం తలెత్తింది. ఈ దేశాల్లో పాకిస్థాన్ కూడా ఉంది. ఈ క్రమంలో అక్కడి ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లుగా మోసిన్ నఖ్వీ తెలిపారు. ఇంధన సంక్షోభం కారణంగా.. ప్రజలు తమ రాకపోకలను పరిమితం చేసుకోవాలని ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ కోరారని నఖ్వీ చెప్పారు. ఇప్పటికే పాఠశాలలను మూసివేసినట్లుగా వివరించారు. చాలా ప్రాంతాల్లో వర్క్ ఫ్రమ్ హోమ్‌ను కొనసాగిస్తున్నట్లు తెలిపారు. ఈద్ సెలవులను పొడిగించినట్లు వెల్లడించారు. ఈ యుద్ధం ఎంత కాలం కొనసాగుతుందో తమకు తెలియని చెప్పుకొచ్చారు.
ఈ క్రమంలోనే భద్రతా సంస్థలతో చర్చించిన తరువాత పీఎస్ఎల్ షెడ్యూల్ ప్రకారమే జరుగుతుందన్నారు. అయితే.. ప్రస్తుత సంక్షోభం కారణంగా మ్యాచ్‌లు ప్రేక్షకులు లేకుండానే జరుగుతాయన్నారు. ఇక టోర్నీ ప్రారంభోత్సవ వేడుకను కూడా రద్దు చేసినట్లు చెప్పారు.
ఈ క్రమంలో పాకిస్థాన్ క్రికెట్ బోర్డుపై విమర్శల వర్షం కురుస్తోంది. ‘పీఎస్ఎల్ రాబోతుంది. ఇది లక్షలాది మంది క్రికెట్ అభిమానులకు చాలా ఉత్సాహాన్ని కలిగిస్తుంది. PSL అంటే ఏమిటో అని మేము ఎప్పుడూ ఆశ్చర్యపోయేవాళ్ళం.. తీరా చూస్తే దాని అర్థం ‘పెట్రోల్ కొరత లీగ్’ అని ఇప్పుడు తెలిసింది.’ అని ఐస్‌లాండ్ క్రికెట్ పీసీబీని ఎగతాళి చేసింది.
Sania Mirza : రంజాన్ స్పెషల్.. ఫ్యామిలీతో ఫోటోలు షేర్ చేసిన సానియా మీర్జా
