Deepfake : మీ దుంపలు తెగ.. తమ్ముడితో ఫోటో దిగితే.. ఇలా చేస్తారా..?
Deepfake Technology : గతంతో పోలిస్తే ఇప్పుడు సోషల్ మీడియా వాడకం ఎక్కువైంది. సామాజిక మాధ్యమాల్లో వచ్చే వార్తలు, ఫోటోలు, వీడియోలు నిజమైనవో కాదో తెలుసుకోవడం కష్టంగా మారింది.
![Deepfake : మీ దుంపలు తెగ.. తమ్ముడితో ఫోటో దిగితే.. ఇలా చేస్తారా..? Deepfake : మీ దుంపలు తెగ.. తమ్ముడితో ఫోటో దిగితే.. ఇలా చేస్తారా..?](https://10tv.in/wp-content/uploads/2023/11/New-Project-7-8.jpg)
Pic of Sara Tendulkar hugging Shubman Gill Is Morphed
గతంతో పోలిస్తే ఇప్పుడు సోషల్ మీడియా వాడకం ఎక్కువైంది. సామాజిక మాధ్యమాల్లో వచ్చే వార్తలు, ఫోటోలు, వీడియోలు నిజమైనవో కాదో తెలుసుకోవడం కష్టంగా మారింది. టెక్నాలజీని కొందరు మిస్ యూజ్ చేస్తున్నారు. డిప్ ఫేక్ వీడియో టెక్నాలజీ ఉపయోగించి హీరోయిన్ రష్మిక మంధాన మార్ఫింగ్ వీడియోను రూపొందించారు. ఈ వీడియో వైరల్‌గా మారగా దీనిపై పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు స్పందించి రష్మికకు మద్దతుగా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ ఘటనను మరిచిపోకముందే టీమ్ఇండియా క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కూతురు సారా టెండూల్కర్‌కు సంబంధించిన ఓ ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
టీమ్ఇండియా యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్, సారా టెండూల్కర్లు ప్రేమించుకుంటున్నారు అంటూ గత కొంత కాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. టీమ్ఇండియా ఆడే మ్యాచులకు సారా హాజరు అవుతూ ఉత్సాహ పరుస్తుండడం, గిల్ బ్యాటింగ్ చేస్తున్నంత సేపు కెమెరాలు సారా పైనే ఉండడం కూడా ఈ వార్తలకు బలాన్ని చేకూరుస్తున్నాయి. ప్రేమ వార్తల పై అటు గిల్ గానీ, ఇటు సారా గానీ ఎప్పుడూ స్పందించలేదు.
Ben stokes : చరిత్ర సృష్టించిన బెన్‌స్టోక్స్.. ఒకే ఒక్క ఇంగ్లాండ్ ఆటగాడు
కాగా.. గిల్, సారాలు కలిసి ఉన్న ఓ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఫోటోలో సారా గిల్‌ను ప్రేమగా హత్తుకున్నట్లుగా ఉంది. వాస్తవానికి ఇది మార్ఫింగ్ చేసిన ఫోటో. సారా టెండూల్కర్ తమ్ముడు అర్జున్ టెండూల్కర్ పుట్టిన రోజు సెప్టెంబర్ 24న అన్న సంగతి తెలిసిందే. తమ్ముడి పుట్టిన రోజు సందర్భంగా అతడికి శుభాకాంక్షలు తెలియజేస్తూ అతడితో దిగిన కొన్ని ఫోటోలను పోస్ట్ చేసింది. ఈ ఫోటోల్లోని ఓ ఫోటోని తీసుకుని అర్జున్ ఫేస్‌కు బదులు శుభ్‌మన్ ఫేస్‌ను యాడ్ చేశారు. గిల్‌తో సారా ప్రేమలో ఉందంటూ మార్ఫింగ్ ఫోటోను వైరల్ చేస్తున్నారు. దీనిపై నెటీజన్లు మండిపడుతున్నారు.
Pat Cummins : 11.2 ఓవర్లు.. 12 పరుగులు.. టెస్టు మ్యాచ్ కాదు మామ.. వన్డే ప్రపంచకప్ ఇదీ..!
View this post on Instagram