Brisbane International : టెన్నిస్ కోర్టులో విషపూరిత పాము.. భయపడిన ఆటగాళ్లు.. ఆ తరువాత ఏం జరిగిందంటే..?
ఓ వైపు టెన్నిస్ మ్యాచ్ చాలా సీరియస్‌గా జరుగుతోంది. ఇరువురు ప్లేయర్లు నువ్వా నేనా అన్నట్లుగా పోటీపడుతున్నారు.
- Thota Vamshi Kumar
- Updated on- December 31, 2023 / 03:13 PM IST
Poisonous snake interrupts Australia tennis tournament match
Brisbane International tournament : ఓ వైపు టెన్నిస్ మ్యాచ్ చాలా సీరియస్‌గా జరుగుతోంది. ఇరువురు ప్లేయర్లు నువ్వా నేనా అన్నట్లుగా పోటీపడుతున్నారు. ఈ క్రమంలో ఓ పాము కలకలం రేపింది. దీంతో మ్యాచ్‌ను ఆపేశారు. ఈ ఘటన బ్రిస్బేన్ ఇంటర్నేషనల్ క్వాలిఫైయింగ్ టోర్నీలో చోటు చేసుకుంది.
బ్రిస్బేన్ ఇంటర్నేషనల్ క్వాలిఫైయింగ్ టోర్నీలో భాగంగా శనివారం డోమ్నిక్ థీమ్, జేమ్స్ మెక్‌కాబేలు తలపడ్డారు. ఇరువురు ఆటగాళ్లు హోరాహోరీగా పోరాడుతున్నారు. ఈ సమయంలో ప్రేక్షకుల గ్యాలరీకి ముందుకున్న విద్యుత్ తీగల మధ్య ఓ పాము ఉండడాన్ని గమనించారు. వెంటనే చైర్ అంఫైర్ ఆటను నిలిపివేశారు. పాములను పట్టే వారిని పిలిపించారు. వారు వచ్చి పామును జాగ్రత్తగా పట్టుకున్నారు.
Team India : రెండో టెస్టుకు ముందు టీమ్ఇండియాకు ఎదురుదెబ్బ..?
ఆ పామును బ్యాగులో బంధించి తీసుకువెళ్లారు. దానిని విషపూరితమైన ఈస్టర్న్ బ్రౌన్ స్నేక్ గా గుర్తించారు. ఈ ఘటన కారణంగా మ్యాచ్ కు దాదాపు 40 నిమిషాలు అంతరాయం కలిగింది. కాగా.. ఈ మ్యాచ్ ఆరంభంలో చెలరేగి ఆడిన జేమ్స్ మొదటి సెట్‌ను 6-2 తేడాతో గెలిచాడు. ఆ తరువాత డోమ్నిక్ థీమ్ పుంజుకున్నాడు. 7-6తో రెండో సెట్‌ను గెలుపొందాడు. దీంతో మూడో సెట్ అనివార్యమైంది. ఇద్దరు కూడా నువ్వా నేనా అన్నట్లుగా ఆడారు. అయితే.. జేమ్స్ అనవసర తప్పిదాలు చేయడంతో 6-4 డోమ్నిక్ సెట్‌తో పాటు మ్యాచ్‌ను కూడా సొంతం చేసుకున్నాడు.
ఆస్ట్రేలియన్ మ్యూజియం యొక్క వెట్‌సైట్ ప్రకారం.. ఈస్టర్న్ బ్రౌన్ స్నేక్ చాలా ప్రమాదకరమైనవి. ఇవి గనుక కాటు వేస్తే.. వీటి విషప్రభావం వల్ల పక్షవాతం రావడంతో పాటు తీవ్ర రక్తస్రావం జరుగుతుంది. ప్రపంచంలోని 25 అత్యంత విషపూరితమైన వాటిలో 20 ఆస్ట్రేలియాలోనే ఉన్నాయి.
మ్యాచ్ అనంతరం థీమ్ ఈ ఘటన పై మాట్లాడుతూ.. తాను నిజంగా జంతువులను ప్రేమిస్తానని, ముఖ్యంగా వేరే దేశ జంతువులు అంటే చాలా ఇష్టం అన్నాడు. అయితే ఇది నిజంగా విషపూరితమైన పాము అని, అది బాల్‌కిడ్‌లకు దగ్గరగా ఉందని, కాబట్టి ఇది నిజంగా ప్రమాదకర పరిస్థితి చెప్పాడు. నా జీవితంలో ఎప్పుడూ ఇలా జరగలేదు. దీనిని ఎప్పటికీ మరిచిపోనని థీమ్ చెప్పాడు.
కాగా.. మెయిన్ డ్రాకు చేరుకోవడానికి థీమ్‌కు ఇంకొ విజయం మాత్రమే అవసరం.
