Praggnanandhaa: స్వదేశానికి చేరుకున్న యువ గ్రాండ్ మాస్టర్ ప్రజ్ఞానందకు ఘన స్వాగతం ..
ప్రజ్ఞానంద మాట్లాడుతూ.. ఇంతటి ఘన స్వాగతం పట్ల నేను చాలా సంతోషంగా ఉన్నానని అన్నారు. యువకులు అందించిన జాతీయ త్రివర్ణ పతాకాన్ని చేతబూని
- Harish Thanniru
- Updated on- August 30, 2023 / 01:12 PM IST
Pragggnanandhaa
Praggnanandhaa: భారత యువ చెస్ సంచలనం, గ్రాండ్ మాస్టర్ ప్రజ్ఞానంద చెస్ ప్రపంచ కప్ ఫైనల్లో రన్నరప్‌గా నిలిచిన విషయం తెలిసిందే. తుదిపోరులో ప్రజ్ఞానందపై దిగ్గజ ఆటగాడు మగ్నస్ కార్లసన్ (నార్వే) విజయం సాధించారు. అయితే, భారత యువ ఆటగాడు ఫైనల్లో ఓడినా గొప్ప పోరాటం చేశాడంటూ ప్రముఖులు, నెటిజన్లు అతడిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. తాజాగా ప్రజ్ఞానంద స్వదేశానికి చేరుకున్నారు. బుధవారం చెన్నైలోని విమానాశ్రయానికి చేరుకున్న ప్రజ్ఞానందకు ఘన స్వాగతం లభించింది. రాష్ట్ర క్రీడాశాఖ అధికారులు విమానాశ్రయం వద్ద ఘన స్వాగతం పలికారు.
Praggnanandhaa: ఆన్లైన్ చెస్ టోర్నమెంట్లో వరల్డ్ నెం.1ను ఓడించిన ఇండియన్ ప్లేయర్ ప్రగ్నానందా
విమానాశ్రయం వద్దకు భారీ సంఖ్యలో అభిమానులు తరలివచ్చి జాతీయ జెండాలు చేతభూని పెద్ద పెట్టున నినాదాలు చేశారు. ప్రజ్ఞానందకు పూల మాలలు, శాలువాలు, పుష్పగుచ్చాలను అందించేందుకు అభిమానులు పోటీపడ్డారు. తమిళనాడు జానపద నృత్యాలతో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ప్రజ్ఞానంద మాట్లాడుతూ.. ఇంతటి ఘన స్వాగతం పట్ల నేను చాలా సంతోషంగా ఉన్నానని అన్నారు. యువకులు అందించిన జాతీయ త్రివర్ణ పతాకాన్ని చేతబూని ప్రజ్ఞానంద ముందుకు సాగారు. మరోవైపు అతని తల్లి నాగలక్ష్మీ తన 18ఏళ్ల కుమారుడికి లభించిన ఘనమైన ఆదరణపట్ల సంతోషం వ్యక్తం చేసింది.
