R Praggnanandhaa : చరిత్ర సృష్టించిన ప్రజ్ఞానంద.. నార్వే చెస్ టైటిల్ గెలిచిన తొలి భారతీయుడు..
భారత యువ గ్రాండ్ మాస్టర్ ఆర్ ప్రజ్ఞానంద (R Praggnanandhaa) అరుదైన ఘనత సాధించాడు.
- Thota Vamshi Kumar
- Updated on- June 6, 2026 / 09:20 AM IST
R Praggnanandhaa creates History Becomes 1st Indian To Win Norway Chess Title
- ప్రజ్ఞానంద అరుదైన ఘనత
- నార్వే చెస్ టోర్నీ గెలిచిన తొలి భారతీయుడు
R Praggnanandhaa : భారత యువ గ్రాండ్ మాస్టర్ ఆర్ ప్రజ్ఞానంద అరుదైన ఘనత సాధించాడు. నార్వే చెస్ టోర్నీ గెలిచిన తొలి భారతీయుడిగా చరిత్ర సృష్టించాడు. 20 ఏళ్ల ఈ గ్రాండ్ మాస్టర్ క్లాసికల్ విభాగంలో టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. ఆఖరి రౌండర్‌లో జర్మనీకి చెందిన విన్సెంట్ కీమర్ ను ఓడించి విజేతగా నిలిచాడు.
ఆఖరి రౌండ్ ప్రారంభానికి ముందు 15 పాయింట్లతో మూడో స్థానంలో ఉన్నాడు ప్రజ్ఞానంద. సరైన సమయంలో పుంజుకుని తన క్లాసికల్ గేమ్‌ను గెలిచి మూడు పాయింట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. దీంతో అతడి పాయింట్ల సంఖ్య 18కి చేరాయి. ఇక ఆఖరి రౌండ్ ప్రారంభానికి ముందు 15.5 పాయింట్లతో పట్టికలో అగ్రస్థానంలో ఉన్న అమెరికన్ గ్రాండ్‌మాస్టర్ వెస్లీ సో ప్రాన్స్ ఆటగాడు అలీ రెజాతో జరిగిన మ్యాచ్‌ను డ్రా చేసుకున్నాడు.
దీంతో వారి పోటీ ఆర్మాగెడాన్ టై-బ్రేక్‌కు దారితీసింది. ఈ టై-బ్రేక్‌లో విజయం వెస్లీ సో విజయం సాధించినా కూడా అతడి ఖాతాలో 1.5 పాయింట్లు జమ అయ్యాయి. దీంతో అతడి మొత్తం పాయింట్లు 17కు పరిమితం అయ్యాయి. 18 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచిన అగ్రస్థానంలో నిలిచి ప్రజ్ఞానంద ఛాంపియన్‌గా నిలిచాడు.
ప్రజ్ఞానందకు ఇది రెండో నార్వే చెస్ టోర్నీ మాత్రమే. ఈ సీజన్‌లో ఆరంభంలో కాస్త నెమ్మదిగా ఆడినప్పటికి కూడా తరువాత బాగా పుంజుకున్నాడు. తొలి ఆరు రౌండ్లలో మూడింటిలో ఓడిపోయినప్పటికి ఆ తరువాత వరుసగా నాలుగు విజయాలు సాధించాడు. ఏడు సార్లు నార్వే చెస్ టోర్నీ విజేతగా నిలిచిన ప్రపంచ నంబర్ 1 మాగ్నస్ కార్ల్‌సన్‌ను ఈ టోర్నీలో ప్రజ్ఞానంద రెండు సార్లు ఓడించాడు.
