IND vs NZ : క్రికెట్ ఫ్యాన్స్‌కు బ్యాడ్‌న్యూస్.. భారత్ వర్సెస్ న్యూజిలాండ్ మూడో టీ20 మ్యాచ్‌కు వర్షం ముప్పు..!
IND vs NZ : ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా నేడు భారత్, న్యూజిలాండ్ జట్లు వెల్లింగ్టన్ వేదికగా మూడో టీ20 మ్యాచ్‌లో తలపడనున్నాయి.
- Thota Vamshi Kumar
- Updated on- October 27, 2026 / 10:48 AM IST
Rain Threat to IND vs NZ 3rd T20 match in Wellington
IND vs NZ : ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా నేడు భారత్, న్యూజిలాండ్ జట్లు వెల్లింగ్టన్ వేదికగా మూడో టీ20 మ్యాచ్‌లో తలపడనున్నాయి. భారత కాలమానం ప్రకారం ఈ మ్యాచ్ మధ్యాహ్నం 12.30 గంటలకు ప్రారంభం కానుంది. తొలి రెండు మ్యాచ్‌ల్లో విజయం సాధించిన భారత్ ఈ మ్యాచ్‌లోనూ గెలిచి సిరీస్‌ను మరో రెండు మ్యాచ్‌లు మిగిలి ఉండగానే సొంతం చేసుకోవాలని భావిస్తోంది. మరోవైపు ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌లో భారత్ ఆధిక్యాన్ని తగ్గించాలని న్యూజిలాండ్ పట్టుదలగా ఉంది.
అయితే ఈ మ్యాచ్‌కు వర్షం ముప్పు పొంచి ఉంది. ఆక్యూ వెదర్ ప్రకారం మంగళవారం వెల్లింగ్టన్‌లో దాదాపు 3 గంటల పాటు వర్షం కురిసే అవకాశం ఉంది. ఆకాశం దాదాపు 56 శాతం మేఘావృతమై ఉంటుందని అంచనా. ఉదయం వర్షం పడే అవకాశాలు 87 శాతంగా ఉండగా.. మధ్యాహ్నానికి అవి కేవలం 3 శాతానికి తగ్గనున్నాయి. సాయంత్రం వేళ వర్షం పడే అవకాశం మరింత తగ్గి 1 శాతానికి చేరుతుందని పేర్కొంది. అయితే నగరంలో బలమైన గాలులు వీస్తుండటంతో వాతావరణ పరిస్థితులు ఎప్పటికప్పుడు మారే అవకాశం ఉంది.
IND vs NZ : భారత్ vs న్యూజిలాండ్ మూడో టీ20 మ్యాచ్.. జియోలో రాదు.. మరీ ఎక్కడ చూడొచ్చంటే?
వెల్లింగ్టన్‌లోని బేసిన్ రిజర్వ్ మైదానం మూడు వైపులా బహిరంగంగా ఉండటంతో ఇక్కడ గాలుల ప్రభావం ఆటగాళ్లపై ఎక్కువగా ఉంటుంది. గాలి ఏ దిశ నుంచి వీస్తుందో అంచనా వేయడం కూడా కష్టమే. ఈ పరిస్థితులు పర్యాటక జట్లకు ఎప్పటి నుంచో సవాలుగా మారుతున్నాయి.
సోమవారం భారత జట్టు సాధన చేస్తున్న సమయంలో వెల్లింగ్టన్‌లో గంటకు 120 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచినట్లు సమాచారం. దీంతో మూడో టీ20లో గాలుల ప్రభావం ఆటగాళ్ల ప్రదర్శనపై ఎలా ఉంటుందన్నది ఆసక్తికరంగా మారింది.
