IND vs NZ : క్రికెట్ అభిమానులకు బ్యాడ్‌న్యూస్.. భారత్ vs న్యూజిలాండ్ రెండో వన్డేకు వర్షం ముప్పు..!
IND vs NZ : ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా శనివారం (నవంబర్ 7) భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య రెండో వన్డే మ్యాచ్ జరగనుంది.
- Thota Vamshi Kumar
- Published on- November 6, 2026 / 11:37 AM IST
Rain threat to IND vs NZ second ODI in Wellington
IND vs NZ : ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా శనివారం (నవంబర్ 7) భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య రెండో వన్డే మ్యాచ్ జరగనుంది. అయితే.. ఈ మ్యాచ్‌కు కూడా వర్షం ముప్పు పొంచి ఉంది. ఆక్లాండ్ వేదికగా జరిగిన తొలి వన్డే మ్యాచ్‌కు కూడా వరుణుడు అంతరాయం కలిగించిన సంగతి తెలిసిందే.
శుక్రవారం ఉదయం నుంచి వెల్లింగ్టన్లో చిరుజల్లులతో కూడిన వర్షం కురవడంతో ఇరు జట్ల ప్రాక్టీస్ షెడ్యూళ్లలో మార్పులు చోటు చేసుకున్నాయి. వాస్తవానికి రెండు జట్లు మ్యాచ్ జరిగే హెన్రీ స్టేడియంలో కాకుండా బేసిన్ రిజర్వ్‌లో సాధన చేయాల్సి ఉంది. అయితే వర్షం కారణంగా న్యూజిలాండ్ జట్టు తమ ప్రాక్టీస్‌ను వెల్లింగ్టన్ కాలేజీలోని ఇండోర్‌కు మార్చుకుంది. భారత జట్టు మాత్రం ప్రాక్టీస్ సెషన్‌ను పూర్తిగా రద్దు చేసుకుంది.
శనివారం కూడా వర్షం కురిసే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ నివేదికలు వెల్లడిస్తున్నాయి. అక్యూ వెదర్ ప్రకారం.. శనివారం భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. పగటి పూట వర్షం పడే అవకాశాలు 60 శాతం ఉండగా రాత్రి పూట 55 శాతంగా ఉన్నట్లు తెలిపింది. దీంతో రెండో వన్డే సజావుగా సాగుతుందా? లేదా? అన్నది ఆసక్తికరంగా మారింది.
ఆక్లాండ్ వేదికగా జరిగిన తొలి వన్డేకు కూడా వర్షం అంతరాయం కలిగించిన విషయం తెలిసిందే. వర్షం కారణంగా మ్యాచ్ ప్రారంభం 10 నిమిషాలు ఆలస్యమైంది. అనంతరం భారత ఇన్నింగ్స్ సమయంలో రెండు విడతలుగా సుమారు గంటా 40 నిమిషాల పాటు వర్షం కురవడంతో భారత లక్ష్యాన్ని 50 ఓవర్లలో 186 పరుగుల నుంచి 32 ఓవర్లలో 143 పరుగులకు కుదించారు.
IPL : 40 కోట్ల ఇస్తేనే జట్టులో ఉంటాం.. లేదంటే.. ఫ్రాంఛైజీలకు షాకిస్తున్న స్టార్ ఆటగాళ్లు..
ఈ మ్యాచ్‌లో భారత్ ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. లక్ష్య ఛేదనలో విరాట్ కోహ్లీ కేవలం 51 బంతుల్లోనే 74 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. మరోవైపు 10 ఓవర్లలో 22 పరుగులిచ్చి రెండు వికెట్లు పడగొట్టిన అన్షుల్ కాంబోజ్‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.
