IPL Qualifier 2 GT vs RR: క్వాలిఫ‌య‌ర్ 2 మ్యాచ్‌కు వ‌ర్షం ముప్పు! ర‌ద్దైతే గుజ‌రాత్‌, రాజ‌స్థాన్‌ల‌లో ఫైన‌ల్ చేరేది ఎవ‌రంటే?

నేడు (శుక్ర‌వారం మే 29) ముల్లన్‌పూర్ వేదిక‌గా క్వాలిఫ‌య‌ర్‌-2లో గుజ‌రాత్ టైటాన్స్‌, రాజ‌స్థాన్ రాయ‌ల్స్ (GT vs RR) త‌ల‌ప‌డ‌నున్నాయి.

Rain threat to IPL 2026 Qualifier 2 GT vs RR match what happen if Match is Abandoned

  • ముల్ల‌న్‌పూర్ వేదిక‌గా నేడు క్వాలిఫ‌య‌ర్ -2 మ్యాచ్‌
  • గుజ‌రాత్‌తో త‌ల‌ప‌డ‌నున్న రాజ‌స్థాన్
  • మ్యాచ్‌కు వ‌ర్షం ముప్పు

IPL Qualifier 2 GT vs RR : ఐపీఎల్ 2026 సీజ‌న్ ఆఖ‌రి అంకానికి చేరుకుంది. నేడు (శుక్ర‌వారం మే 29) ముల్లన్‌పూర్ వేదిక‌గా క్వాలిఫ‌య‌ర్‌-2లో గుజ‌రాత్ టైటాన్స్‌, రాజ‌స్థాన్ రాయ‌ల్స్ త‌ల‌ప‌డ‌నున్నాయి. ఈ మ్యాచ్‌లో గెలిచిన జ‌ట్టు నేరుగా ఫైన‌ల్ మ్యాచ్‌కు చేరుకుంటుంది. మే 31న అహ్మ‌దాబాద్‌లోని న‌రేంద్ర మోదీ స్టేడియంలో ఫైన‌ల్ మ్యాచ్ జ‌ర‌గ‌నుంది. ఇప్ప‌టికే రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు ఫైన‌ల్‌కు చేరుకున్న సంగ‌తి తెలిసిందే.

ఇదిలా ఉంటే.. క్వాలిఫ‌య‌ర్ 2 మ్యాచ్‌కు వ‌ర్షం ముప్పు పొంచి ఉంద‌ని వాతావ‌ర‌ణ శాఖ తెలియ‌జేసింది. పంజాబ్‌లోని ప‌లు ప్రాంతాల్లో భారీ వ‌ర్షం, వ‌డ‌గ‌ళ్ల వాన కురిసే అవ‌కాశం ఉంద‌ని ఐఎండీ హెచ్చ‌రిక‌లు జారీ చేసింది. అయితే.. అదృష్ట‌వ‌శాత్తు ముల్లన్‌పూర్‌లో భారీ వ‌ర్షం కురిసే అవ‌కాశం లేద‌ని తెలుస్తోంది. కానీ మ్యాచ్ జ‌రిగే స‌మ‌యంలో వ‌ర్షం కురిసే అవ‌కాశం 10 శాతం ఉన్న‌ట్లు స‌మాచారం.

*Vaibhav Sooryavanshi : నువ్వు తోపు బ్రో..! వైభ‌వ్‌ను ముప్పు తిప్ప‌లు పెట్టిన బౌల‌ర్ ఎవ‌రో తెలుసా? మెయిడెన్ ఓవ‌ర్‌..

వ‌ర్షం ప‌డి మ్యాచ్ ర‌ద్ద‌తే..

ఒక వేళ భారీ వ‌ర్షం ప‌డి క్వాలిఫ‌య‌ర్-2 మ్యాచ్ ర‌ద్దు అయితే ప‌రిస్థితి ఏంటి? ఎవ‌రు ఫైన‌ల్‌కు వెళ‌తారు ? రూల్స్ ఏం చెబుతున్నాయ‌నే దానిపై స‌ర్వ‌త్రా ఆస‌క్తి ఉంది. లీగ్ ద‌శ‌లో మ్యాచ్ ర‌ద్దు అయితే.. ఇరు జ‌ట్ల‌కు చెరో పాయింట్ కేటాయిస్తారు అన్న సంగ‌తి తెలిసిందే.

ఫైన‌ల్ మ్యాచ్‌కు రిజ‌ర్వ్ డే ఉంటుంది. ప్లేఆఫ్స్ మ్యాచ్‌ల‌కు రిజ‌ర్వ్ డే ఉండ‌దు. దీంతో ఆ రోజే మ్యాచ్‌ను నిర్వ‌హించాల్సి ఉంటుంది. ఒక‌వేళ మ్యాచ్ ను నిర్వ‌హించ‌లేని ప‌రిస్థితులు ఉండి, ర‌ద్దు చేస్తే అప్పుడు ఐపీఎల్ ప్లేఆఫ్స్ రూల్స్ ప్ర‌కారం లీగ్ ద‌శ‌లో పాయింట్ల ప‌ట్టిక‌లో మెరుగైన స్థానంలో ఉన్న జ‌ట్టు ముందుకు వెలుతుంది. అంటే ఈ లెక్క‌న వ‌ర్షం ప‌డి మ్యాచ్ ర‌ద్దైతే.. లీగ్‌ ద‌శ‌లో రెండో స్థానంలో నిలిచిన గుజ‌రాత్ టైటాన్స్ ఫైన‌ల్‌లో అడుగుపెడుతుంది.

*Vaibhav Sooryavanshi : గుజ‌రాత్ పై వైభ‌వ్ సూర్య‌వంశీ 68 ప‌రుగులు చేస్తే.. మ‌రో చ‌రిత్ర‌..

హెడ్‌-టు-హెడ్..

గుజ‌రాత్, రాజ‌స్థాన్‌లు ఇప్ప‌టి వ‌ర‌కు ముఖాముఖిగా 10 సంద‌ర్భాల్లో త‌ల‌ప‌డ్డాయి. ఇందులో 7 మ్యాచ్‌ల్లో గుజ‌రాత్ విజ‌యం సాధించింది. మూడు మ్యాచ్‌ల్లో రాజ‌స్థాన్ రాయ‌ల్స్ గెలిచింది.