Rajat Patidar : రజత్ పాటిదార్ వరల్డ్ రికార్డు.. టీ20ల్లో ఒకే ఒక కెప్టెన్..
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ రజత్ పాటిదార్ (Rajat Patidar ) అరుదైన ఘనత సాధించాడు.
- Thota Vamshi Kumar
- Updated on- May 27, 2026 / 11:23 AM IST
Rajat Patidar creates T20 world record Most sixes by a captain in a T20 tournament (pic credit@rcb)
- రజత్ పాటిదార్ అరుదైన ఘనత
- ఓ టీ20 టోర్నీలో అత్యధిక సిక్సర్లు కొట్టిన కెప్టెన్‌గా
Rajat Patidar : రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ రజత్ పాటిదార్ అరుదైన ఘనత సాధించాడు. మంగళవారం గుజరాత్ టైటాన్స్‌తో ధర్మశాల వేదికగా జరిగిన క్వాలిఫయర్-1 మ్యాచ్‌లో పెను విధ్వంసం సృష్టించాడు. 33 బంతులు ఎదుర్కొన్న అతడు 5 ఫోర్లు, 9 సిక్సర్ల సాయంతో 93 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఈ క్రమంలో అతడు ఓ మైలురాయిని చేరుకున్నాడు. ఓ టీ20 టోర్నమెంట్‌లో కెప్టెన్‌గా అత్యధిక సిక్సర్లు కొట్టిన ఘనతను అందుకున్నాడు.
గతంలో ఈ రికార్డు రియాన్ పరాగ్ పేరిట ఉండేది. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ 2023/24లో అస్సాం జట్టును నాయకత్వం వహించిన పరాగ్ 40 సిక్సర్లు బాదాడు. తాజా మ్యాచ్‌తో కలిపి పాటిదార్ ఈ ఐపీఎల్ సీజన్‌లో సిక్సర్ల సంఖ్య 41కి చేరుకుంది. ఇక ఈ జాబితాలో పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మూడో స్థానంలో ఉన్నాడు. అతడు ఐపీఎల్ 2025 సీజన్‌లో 39 సిక్సర్లు బాదాడు.
ఓ టీ20 టోర్నమెంట్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన ప్లేయర్లు వీరే..
* రజత్ పాటిదార్ – ఐపీఎల్ 2026లో 41 సిక్సర్లు*
* రియాన్ పరాగ్ – సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ 2023/24లో 40 సిక్సర్లు
* శ్రేయస్ అయ్యర్ – ఐపీఎల్ 2025లో 39 సిక్సర్లు
* విరాట్ కోహ్లీ – ఐపీఎల్ 2016లో 38 సిక్సర్లు
* క్రిస్ గేల్ -జమైకా టాలవాస్‌కు నాయకత్వం వహిస్తూ సీపీఎల్ 2016లో 37 సిక్సర్లు
