Ranji Trophy final 2026 Jammu and Kashmir 584 all out in 1st Innings
Ranji Trophy final : రంజీట్రోఫీ ఫైనల్ మ్యాచ్‌లో జమ్మూకశ్మీర్ జట్టు అదరగొట్టింది. కర్ణాటకతో హుబ్లీ వేదికగా జరుగుతున్న ఫైనల్ మ్యాచ్‌లో కర్ణాటక తొలి ఇన్నింగ్స్‌లో 584 పరుగులకు ఆలౌటైంది.
ఓవర్ నైట్ స్కోరు 527/6 తో మూడో రోజు ఆటను కొనసాగించిన జమ్మూకశ్మీర్ మరో 57 పరుగులు జోడించి మిగిలిన నాలుగు వికెట్లు కోల్పోయింది. జమ్మూ కశ్మీర్ బ్యాటర్లలో శభమ్ పుందిర్ (121; 247 బంతుల్లో 12 ఫోర్లు, 2 సిక్సర్లు) భారీ సెంచరీతో చెలరేగాడు.
Sikandar Raza : భారత్‌తో మ్యాచ్.. అరుదైన ఘనత పై జింబాబ్వే కెప్టెన్ సికిందర్ రజా కన్ను..
Frustrating the attack 👊
Helped piling on the runs 🏏Watch Sahil Lotra’s invaluable knock of 72 (138) that ensured Jammu & Kashmir finished with a massive 5️⃣8️⃣4️⃣ on the board 🎥
Updates ▶️ https://t.co/G0ytZLEyNB#RanjiTrophy | @IDFCFIRSTBank pic.twitter.com/ReGUFIJPp1
— BCCI Domestic (@BCCIdomestic) February 26, 2026
యావర్ హసన్ (88; 150 బంతుల్లో 13 ఫోర్లు), పరాస్ డోగ్రా (70; 166 బంతుల్లో 8 ఫోర్లు), అబ్దుల్ సమద్ (61; 104 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్), కన్హయ్య వాధవన్ (70; 109 బంతుల్లో 9 ఫోర్లు), సాహిల్ లోత్రా (72; 138 బంతుల్లో 8 ఫోర్లు) లు హాఫ్ సెంచరీలతో రాణించారు. కర్ణాటక బౌలర్లలో ప్రసిద్ధ్ కృష్ణ 5 వికెట్లు పడగొట్టాడు. విద్యాధర్ పాటిల్, విజయ్‌కుమార్ వైషాక్, శ్రేయాస్ గోపాల్, శిఖర్ శెట్టి లు తలా ఓ వికెట్ సాధించారు.