WPL 2024 : భారీ సిక్సర్ కొట్టిన ఆర్సీబీ బ్యాటర్.. ఆ బాల్ వెళ్లి ఎక్కడ తగిలిందో తెలుసా?.. వీడియో వైరల్

ఆర్సీబీ బ్యాటింగ్ సమయంలో మైదానంలో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. జట్టు స్టార్ ఆల్ రౌండర్ ఎలిస్సే పెర్రీ కొట్టిన భారీ సిక్స్ కు...

WPL 2024 : భారీ సిక్సర్ కొట్టిన ఆర్సీబీ బ్యాటర్.. ఆ బాల్ వెళ్లి ఎక్కడ తగిలిందో తెలుసా?.. వీడియో వైరల్

WPL 2024

Elysse Perry : ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) 2024 క్రికెట్ ప్రేమికుల్లో ఉత్సాహాన్ని నింపుతోంది. మహిళా క్రికెటర్లు అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నారు. సోమవారం రాత్రి ఆర్సీబీ వర్సెస్ యూపీ వారియర్జ్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో ఆర్సీబీ కెప్టెన్ స్మృతి మంధాన తుఫాన్ ఇన్నింగ్స్ కు తోడు ఎల్లిస్ పెర్రీ మద్దతు తోడవ్వడంతో జట్టు భారీ స్కోర్ చేసింది. స్మృతి కేవలం 50 బంతుల్లో 10 ఫోర్లు, మూడు సిక్సర్ల సహాయంతో 80 పరుగులు చేసింది. ఎల్లీస్ పెర్రీ హాఫ్ సెంచరీ చేసింది. దీంతో ఆర్సీబీ జట్టు నిర్ణీత ఓవర్లలో కేవలం మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి 198 పరుగులు చేసింది. ఆ తరువా తబ్యాటింగ్ చేసిన యూపీ వారియర్స్ ఎనిమిది వికెట్లు కోల్పోయి 175 పరుగులు మాత్రమే చేయగలిగింది.

Also Read : రిటైర్‌మెంట్ హింట్ ఇచ్చిన ధోని? ‘కొత్త సీజన్-కొత్త పాత్ర‌’.. అంటూ పోస్ట్‌..

ఆర్సీబీ బ్యాటింగ్ సమయంలో మైదానంలో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. జట్టు స్టార్ ఆల్ రౌండర్ ఎలిస్సే పెర్రీ కొట్టిన భారీ సిక్స్ కు కారు అద్దం పగిలిపోయింది. డబ్ల్యూపీఎల్ ప్రస్తుత సీజన్ పూర్తయిన తరువాత ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ కు ఈ కారును అందిస్తారు. అయితే, దీనిని బౌండరీ లైన్ అవతల ప్రదర్శనగా ఉంచారు. ఎలిస్సే పెర్రీ కొట్టిన బంతి కారు అద్దానికి తగిలి అద్దం పూర్తిగా పగిలిపోయింది. దీంతో పెర్రీ ‘అయ్యో కారు అద్దం పగిలిందే’ అన్నట్లుగా తల పట్టుకుంది. గ్రౌండ్ లోని ప్రేక్షకులు మాత్రం కేరింతలతో పెర్రీని అభినందించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.