RCB vs DC : గ్రీన్ కలర్ జెర్సీతో బరిలోకి దిగిన బెంగళూరు.. ఎందుకో తెలుసా?
ఢిల్లీతో మ్యాచ్‌లో ఆర్‌సీబీ ఆటగాళ్లు (RCB vs DC) గ్రీన్ కలర్ జెర్సీతో బరిలోకి దిగారు.
- Thota Vamshi Kumar
- Updated on- April 18, 2026 / 03:11 PM IST
RCB vs DC IPL 2026 Do you know why Royal Challengers Bengaluru players wear green jersey today match (pic credit@ipl )
- చిన్నస్వామి వేదికగా ఢిల్లీతో తలపడుతున్న ఆర్‌సీబీ
- గ్రీన్ కలర్ జెర్సీతో బరిలోకి దిగిన బెంగళూరు ప్లేయర్
- పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించేందుకు ప్రతి ఏడాది ఓ మ్యాచ్‌లో ఇలా
RCB vs DC : ఐపీఎల్ 2026 సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు అదరగొడుతోంది. వరుస విజయాలతో దూసుకుపోతుంది. నేడు (శనివారం, ఏప్రిల్ 18)న ఢిల్లీ క్యాపిటల్స్‌తో తలపడుతోంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం ఈ మ్యాచ్‌కు ఆతిథ్యం ఇస్తోంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో ఆర్‌సీబీ మొదట బ్యాటింగ్ చేయనుంది.
ఇదిలా ఉంటే.. ఈ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆటగాళ్లు రెగ్యులర్ రెడ్ కలర్ కాకుండా గ్రీన్ కలర్ జెర్సీలతో బరిలోకి దిగారు. ఇందుకు ఓ ప్రత్యేక కారణం ఉంది.
ప్రతి ఏడాదిలో ఓ మ్యాచ్..
పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించడానికి (Go Green Initiative) రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్రతి ఐపీఎల్ సీజన్‌లో ఓ మ్యాచ్‌లో గ్రీన్ కలర్ జెర్సీతో బరిలోకి దిగుతోంది. 2011 నుంచి ఈ సంప్రదాయాన్ని ఆర్‌సీబీ కొనసాగిస్తోంది. హోం గ్రౌండ్‌లో (చిన్నస్వామిలో) ఆడే మ్యాచ్‌ల్లో ఓ మ్యాచ్‌లో ఈ జెర్సీలను ధరిస్తోంది. రీసైకిల్ చేసిన ప్లాస్టిక్ పదార్థాలతో ఈ జెర్సీలను తయారు చేస్తారు.
తుది జట్లు ఇవే..
ఢిల్లీ క్యాపిటల్స్..
పాతుమ్ నిస్సాంక, కేఎల్ రాహుల్(వికెట్ కీపర్), సమీర్ రిజ్వీ, అక్షర్ పటేల్(కెప్టెన్), డేవిడ్ మిల్లర్, ట్రిస్టన్ స్టబ్స్, ఔకిబ్ నబీ దార్, లుంగీ ఎంగిడి, కుల్దీప్ యాదవ్, నబీ దార్, టి నటరాజన్, ముఖేష్ కుమార్
🚨 TOSS 🚨@DelhiCapitals have won the toss and will bowl first against @RCBTweets
Updates ▶️ https://t.co/vfJ6SccA9T#TATAIPL | #KhelBindaas | #RCBvDC pic.twitter.com/u4tYnk5mUA
— IndianPremierLeague (@IPL) April 18, 2026
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు..
విరాట్ కోహ్లి, ఫిలిప్ సాల్ట్, దేవదత్ పడిక్కల్, రజత్ పాటిదార్(కెప్టెన్), జితేష్ శర్మ(వికెట్ కీపర్), టిమ్ డేవిడ్, రొమారియో షెపర్డ్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, సుయాష్ శర్మ, జోష్ హేజిల్‌వుడ్
