Asia Qualifiers 2024 : పారిస్ ఒలింపిక్స్‌కు బెర్తును ఖరారు చేసుకున్న రిథమ్ సాంగ్వాన్..
యువ షూటర్ రిథమ్ సాంగ్వాన్ అదరగొట్టింది.
- Thota Vamshi Kumar
- Published On : January 11, 2024 / 08:03 PM IST
Rhythm Sangwan
Asia Qualifiers 2024- Rhythm Sangwan : యువ షూటర్ రిథమ్ సాంగ్వాన్ అదరగొట్టింది. పారిస్ వేదికగా జరగబోయే ఒలింపిక్స్‌లో బెర్తును ఖాయం చేసుకుంది. జకర్తా వేదికగా జరుగుతున్న ఆసియా క్వాలిఫయర్స్ మహిళల 25 మీటర్ల పిస్టల్ విభావంలో ఆమె క్యాంస పతాకాన్ని సొంతం చేసుకుంది. ఈ ఈవెంట్‌లో ఆమె కాంస్య పతాకాన్ని ముద్దాడడంతో విశ్వసమరంలో పాల్గొనే అవకాశం లభించింది.
ఈ క్రమంలో పారిస్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన 16వ భారత షూటర్‌గా నిలిచింది. మిగిలిన అన్ని క్వాలిఫయర్స్ పోటీల అనంతరం వీరి సంఖ్య ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయి. టోక్యో ఒలింపిక్స్ లో 15 మంది షూటర్లు బరిలోకి దిగిన సంగతి తెలిసిందే.
హర్యానాకు చెందిన 20 ఏండ్ల సంగ్వాన్‌కు ఆసియా క్వాలిఫయర్స్ లో ఇది మూడో పతకం. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్‌లో క్యాంసం గెలుచుకున్న ఆమె 10మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ టీమ్ విభాగంలో రజతం గెలుచుకుంది. గతేడాది సంగ్వాన్ చైనాలోని హాంగ్జౌ వేదికగా జరిగిన ఆసియా క్రీడల్లో 25 మీటర్ల స్పోర్ట్స్ పిస్టల్ ఈవెంట్‌లో స్వర్ణం గెలుచుకుంది.
తాజాగా సంగ్వాన్ ఆసియా క్వాలిఫయర్స్‌లో 28 పాయింట్లలో మూడో స్థానంలో నిలిచింది. కొరియాకు చెందిన కిమ్ యెజి 32 పాయింట్లతో రజం సొంతం చేసుకోగా చైనాకు చెందిన యంగ్ జిన్ 41 పాయింట్లతో స్వర్ణాన్ని ముద్దాడింది.
Team India : ప్రాక్టీస్‌కు వెళ్లిన టీమ్ఇండియా క్రికెటర్లకు ఊహించని పరిస్థితి..!
?? @SangwanRhythm hits it for Bronze! ?
She clinches the ?and also secures an #Olympic Quota for ?? at the Asian Rifle/Pistol Championship in Jakarta! ??This achievement also marks the highest ever, 16th Quota Place for ?? in shooting – a historic milestone! ??… pic.twitter.com/oB0cWlIC4x
— SAI Media (@Media_SAI) January 11, 2024
