Rinku Singh : మిచెల్ స్టార్క్‌కు 24.75కోట్లు.. మీకు రూ.55లక్షలేనా?.. రింకూ అదిరిపోయే సమాధానం

రింకూ సింగ్ ప్రస్తుతం కేకేఆర్ జట్టు నుంచి రూ. 50 నుంచి 55 లక్షలు పారితోషికం అందుకుంటున్నాడు. రింకూ కేకేఆర్ జట్టును వదిలి వేలంలోకి వెళితే ..

Rinku Singh

Kolkata Knight Riders Batter Rinku Singh : కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) బ్యాటర్ రింకూ సింగ్ గత ఏడేళ్లుగా ఐపీఎల్ లో ఆడుతున్నాడు. పలు మ్యాచ్ లలో తనలోని అద్భుత బ్యాటింగ్ ప్రతిభను చూపాడు. రింకూ చివరిలో బ్యాటింగ్ కు వచ్చి మ్యాచ్ ను గెలిపించిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ఐపీఎల్ లో వచ్చిన గుర్తింపుతో టీమిండియా జట్టుకుసైతం రింకూ ఎంపికయ్యాడు. ముఖ్యంగా ఐపీఎల్ లో కేకేఆర్ జట్టులో ఆడిన రింకూ పలు సందర్భాల్లో మ్యాచ్ విన్నంగా మారాడు. టీ20 ఫార్మాట్ విషయంలో భారత్ లోనే అత్యుత్తమ ఫినిషర్ లలో ఒకడిగా రింకూ గుర్తింపు పొందాడు. ఇటీవల రింకూ దైనిక్ జాగరణ్ తో మాట్లాడుతూ.. ఓ ప్రశ్నకు అదిరిపోయే సమాధానం ఇచ్చాడు.

Also Read : నేను వచ్చేశా..! టీమిండియా సభ్యులతో ప్రాక్టీస్ సెష‌న్‌లో హార్దిక్ పాండ్యా.. ఫొటోలు వైరల్

రింకూ సింగ్ ప్రస్తుతం కేకేఆర్ జట్టు నుంచి రూ. 50 నుంచి 55 లక్షలు పారితోషికం అందుకుంటున్నాడు. రింకూ కేకేఆర్ జట్టును వదిలి వేలంలోకి వెళితే రూ.10కోట్ల బిడ్ కు కూడా చేరుకొనే అవకాశం ఉంది. అయితే, ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ.. కేకేఆర్ ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్ కు రూ.24.75 కోట్లు.. మీకు రూ. 55 లక్షలు. మీరు తక్కువ పొందుతున్నారని అనిపించడం లేదా? అని ప్రశ్నించగా.. రింకూ సింగ్ అదిరిపోయే సమాధానం ఇచ్చాడు.

Also Read : T20 World Cup 2024 : ఎక్స్‌ప‌ర్ట్స్ అంచ‌నా.. టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌లో సెమీస్ చేరే జ‌ట్లు ఇవే..

50-55 లక్షలు కూడా నాకు చాలా ఎక్కువ. ఇంత సంపాదిస్తానని అసలు అనుకోలేదు. నా చిన్నప్పుడు పది రూపాయలు వస్తే చాలు అనుకునేవాడిని. ఇప్పుడు నేను రూ.55లక్షలు పొందుతున్నాను. ఇది చాలా ఎక్కువ. నాకు ఇంతడబ్బు వచ్చిందని నేను అనుకోను. 55లక్షలతో నేను చాలా సంతోషంగా ఉన్నాను. నాకు డబ్బు విలువ బాగా తెలుసు. రింకూ డబ్బు వెంట పరుగెత్తేవాడు కాదు. జనం జేబులో డబ్బులేకుండా భూమిమీదకొస్తారు.. వెళ్లేటప్పుడు అలానే వెళ్తారు అంటూ సాధువు తరహాలో సామెతను రింకూ హైలెట్ చేశాడు.

 

ట్రెండింగ్ వార్తలు