LSG vs DC : అవే మా కొంపముంచాయి.. లేదంటేనా.. లక్నో కెప్టెన్ రిషబ్ పంత్ కామెంట్స్..
బుధవారం ఎకానా స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ (LSG vs DC) 6 వికెట్ల తేడాతో ఓటమిని చవిచూసింది.
- Thota Vamshi Kumar
- Published On : April 2, 2026 / 07:37 AM IST
Rishabh Pant comments after Lucknow Super Giants lost match to Delhi Capitals (pic credit @ipl)
- ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో ఓటమి
- స్పందించిన లక్నో కెప్టెన్ రిషబ్ పంత్
- ఎక్స్‌ట్రాలు, ర్యాంగ్ టైమ్‌లో రనౌట్ కొంపముంచాయి
LSG vs DC : ఐపీఎల్ 2026 సీజన్‌ను లక్నో సూపర్ జెయింట్స్ ఓటమితో ఆరంభించింది. బుధవారం ఎకానా స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో ఓటమిని చవిచూసింది. రాంగ్ టైమ్‌లో దురదృష్టకరమైన రీతిలో తాను రనౌట్ కావడంతో పాటు బ్యాటింగ్ వైఫల్యం, ఎక్స్‌ట్రాలు భారీగా ఇవ్వడంతోనే తాము ఈ మ్యాచ్‌లో ఓడి పోయామని లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ రిషబ్ పంత్ అన్నాడు.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్ జట్టు 18.4 ఓవర్లలో 141 పరుగులకే కుప్పకూలింది. లక్నో బ్యాటర్లలో అబ్దుల్ సమద్ (36; 25 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్), మిచెల్ మార్ష్ (35; 28 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లు) రాణించారు. ఢిల్లీ బౌలర్లలో లుంగి ఎంగిడి, నటరాజన్‌లు చెరో మూడు వికెట్లు తీశారు. కుల్దీప్ యాదవ్ రెండు వికెట్లు పడగొట్టాడు. అక్షర్ పటేల్ ఓ వికెట్ సాధించాడు.
Shreyanka Patil : రెడ్ డ్రెస్‌లో యమా హాట్‌గా భారత మహిళా క్రికెటర్ శ్రేయాంక పాటిల్..
అనంతరం సమీర్ రిజ్వీ (70 నాటౌట్; 47 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్సర్లు) హాఫ్ సెంచరీ చేయగా, ట్రిస్టన్ స్టబ్స్ (39 నాటౌట్; 32 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్) రాణించడంతో 142 పరుగుల లక్ష్యాన్ని 17.1 ఓవర్లలో ఢిల్లీ క్యాపిటల్స్ ఛేదించింది. లక్నో బౌలర్లలో ప్రిన్సీ యాదవ్ రెండు వికెట్లు తీశాడు. మహ్మద్ షమీ, మోసిన్ ఖాన్ లు చెరో వికెట్ పడగొట్టాడు.
రనౌట్‌ను మరిచిపోతా..
మ్యాచ్ అనంతరం ఓటమిపై లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ రిషబ్ పంత్ స్పందించాడు. ఓటమి తనను బాధించిందన్నాడు. తన రనౌట్ గురించి మాట్లాడుతూ.. తన రనౌట్‌ను వీలైనంత త్వరగా మరిచిపోవడం చాలా మంచిదని తాను భావిస్తున్నట్లు చెప్పుకొచ్చాడు. ఎందుకంటే మన నియంత్రణలో లేని విషయం గురించి ఆలోచించడం మంచిది కాదన్నాడు. బ్యాటింగ్‌లో భాగస్వామ్యాలను నెలకొల్పలేకపోయామని చెప్పుకొచ్చాడు. దీంతో బ్యాటింగ్ చేయగల ఆల్‌రౌండర్‌ను ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఆడించాల్సి వచ్చిందన్నాడు.
ఇక హార్ట్ హిట్టర్ నికోలస్ పూరన్ కన్నా ముందు ఆయుష్ బదోనిని ముందు పంపడం గురించి మాట్లాడుతూ.. ఎడమ, కుడి చేతి వాటం కాంబినేషన్ కోసమే అలా చేసినట్లుగా పంత్ తెలిపాడు. అలా చేస్తే ప్రత్యర్థి జట్టు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్‌తో బౌలింగ్ చేయించలేదని తాము భావించామన్నాడు. దురదృష్టవశాత్తు తాను రాంగ్ సమయంలో ఔట్ అయ్యాయని, లేదంటే అక్షర్ పటేల్ పవర్ ప్లేలో మరో ఓవర్ వేసే వాడని అన్నారు. అదే జరిగి ఉంటే మాకు కలిసి వచ్చేదని పంత్ అన్నాడు.
అయితే.. ఆటలో ఇలాంటివి సహజం అని తెలిపాడు. జట్టు త్వరగా వికెట్లు కోల్పోయినప్పుడు బదోని తనదైన ముద్ర వేయాలని తాము కోరుకున్నామన్నాడు. అతడికి కూడా అదే చెప్పామని తెలిపాడు. కొత్త బంతితో బౌలర్లు అద్భుత ప్రదర్శన చేశారన్నాడు. అయితే.. 140 పరుగులను కాపాడుకోవడం అంత సులభం కాదన్నారు. ఏదీ ఏమైనప్పటికి కూడా ఆఖరి వరకు పోరాడామని చెప్పుకొచ్చాడు.
ఈ సీజన్‌లో ముందుకు సాగడానికి ఖచ్చితంగా ఇది ఓ మంచి సంకేతం అని పంత్ అన్నాడు. 20 ఎక్స్‌ట్రాలు ఇవ్వడం తమ కొంపముంచిందన్నాడు. 140 పరుగుల స్కోరును కాపాడుకునే క్రమంలో ప్రత్యర్థిని ఔట్ చేసేందుకు బౌలర్లు ఎక్కువగా ప్రయత్నిస్తుంటారని, ఇలాంటి సమయంలో ఒక్కొసారి ఇలా జరుగుతుందన్నాడు. ఇక ఈ సీజన్ మొత్తం ఓపెనర్‌గా తానే ఆడతానని ఇప్పుడే ఖచ్చితంగా చెప్పలేనని అన్నాడు. ఇందుకు 50-50 ఛాన్స్ ఉందన్నాడు. ఏదీఏమైనప్పటికి తాను టాప్ ఆర్డర్‌లోనే ఆడతానని పంత్ స్పష్టం చేశాడు.
