ఐపీఎల్ 2019లో భాగంగా జరిగిన తొలి మ్యాచ్‍లో ముంబై ఇండియన్స్‌పై ఢిల్లీ క్యాపిటల్స్ అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. 2019వేలంలో ముంబై ఇండియన్స్‌కు అమ్ముడుపోయిన యువరాజ్ సింగ్ సత్తా చాటినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది. అయితే ఢిల్లీ విజయంలో కీలకంగా వ్యవహరించిన రిషబ్ పంత్ ప్రదర్శనపై ప్రశంసలు కురిపిస్తున్నాడు టీమిండియా వెటరన్ క్రికెటర్ యువరాజ్ సింగ్.
‘వరల్డ్ కప్ జట్టులో రిషబ్ పంత్‌కుచోటు దక్కుతుందో లేదో చెప్పలేను. గతేడాది ఐపీఎల్ సీజన్ నుంచి టెస్టుల్లోనూ అద్భుతంగా రాణిస్తున్నాడు. విదేశాల్లో రెండు సెంచరీలు చేయడమే తన ఆటను కనబరుస్తోంది. అతణ్ని ఇంకొంచెం సానబెడితే భవిష్యత్ ప్లేయర్ అవడం ఖాయం’
‘ఆదివారం ఢిల్లీ జట్టుకు దాదాపు గెలుపు అసాధ్యం అనకున్న తరుణంలో 7 సిక్సులతో రెచ్చిపోయాడు. ఫలితంగా ఢిల్లీ 37పరుగులతో విజయం సాధించింది. నేను క్రికెట్ ఆడటం లేదు. ఆడడాన్ని ఎంజాయ్ చేస్తున్నా. సచిన్ టెండూల్కర్ లాంటి దిగ్గజాలను చూశాక రిటైర్మెంట్ ఎప్పుడు అవ్వాలనే ఆలోచనేపోయింది. క్రికెట్‌ను ఎంజాయ్ చేస్తున్నా. ఇక నేను ఆడలేనని అనిపించినప్పుడు నేనే రిటైర్ అయిపోతా’ అని యువీ చెప్పుకొచ్చాడు.