Rishabh Pant : అఫ్గాన్‌తో ఏకైక టెస్టు.. రిష‌బ్ పంత్‌ను ఊరిస్తున్న భారీ రికార్డు..

అఫ్గానిస్థాన్‌తో ఏకైక టెస్టు మ్యాచ్‌కు ముందు రిష‌బ్ పంత్‌ను (Rishabh Pant)భారీ రికార్డు ఊరిస్తోంది.

Rishabh Pant need 6 more to reach 100 sixes milestone in Tests

Rishabh Pant : శ‌నివారం నుంచి భార‌త్, అఫ్గానిస్థాన్ జ‌ట్ల మ‌ధ్య ఏకైక టెస్టు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌కు ముల్ల‌న్‌పూర్ ఆతిథ్యం ఇవ్వ‌నుంది. కాగా.. ఈ మ్యాచ్‌కు ముందు టీమ్ఇండియా వికెట్ కీప‌ర్ బ్యాట‌ర్ రిష‌బ్ పంత్‌ను ఓ అరుదైన రికార్డు ఊరిస్తోంది. ఈ మ్యాచ్‌లో పంత్ 6 సిక్స‌ర్లు కొడితే.. టీమ్ఇండియా త‌రుపున టెస్టుల్లో వంద సిక్స‌ర్లు కొట్టిన తొలి ఆట‌గాడిగా చ‌రిత్ర సృష్టిస్తాడు. భార‌త్ త‌రుపున టెస్టుల్లో అత్య‌ధిక సిక్స‌ర్లు కొట్టిన ఆట‌గాళ్ల జాబితాలో అగ్ర‌స్థానంలో కూడా ప్ర‌స్తుతం పంతే ఉన్నాడు.

2018లో టెస్టుల్లో అరంగ్రేటం చేసిన రిష‌బ్ పంత్ ఇప్ప‌టి వ‌ర‌కు 49 టెస్టులు ఆడాడు. 86 ఇన్నింగ్స్‌ల్లో 42.9 స‌గ‌టుతో 3476 ప‌రుగులు చేశాడు. ఇందులో 8 సెంచ‌రీలు, 18 హాఫ్ సెంచ‌రీలు ఉన్నాయి. ఇక సిక్స‌ర్ల విష‌యానికి వ‌స్తే 94 సిక్సర్లు బాదాడు.

*Gautam Gambhir : అఫ్గాన్‌తో మ్యాచ్‌కు ముందు హెడ్ కోచ్ గౌత‌మ్ గంభీర్ కీల‌క వ్యాఖ్యలు..

టెస్టుల్లో భార‌త్ త‌రుపున అత్య‌ధిక సిక్స‌ర్లు కొట్టిన ప్లేయ‌ర్లు వీరే..

* రిష‌బ్ పంత్ – 49 మ్యాచ్‌ల్లో 94 సిక్స‌ర్లు
* వీరేంద్ర సెహ్వాగ్ – 103 మ్యాచ్‌ల్లో 90 సిక్స‌ర్లు
* రోహిత్ శ‌ర్మ – 67 మ్యాచ్‌ల్లో 88 సిక్స‌ర్లు
* ర‌వీంద్ర జ‌డేజా – 89 మ్యాచ్‌ల్లో 82 సిక్స‌ర్లు
* ఎంఎస్ ధోని – 90 మ్యాచ్‌ల్లో 78 సిక్స‌ర్లు
* స‌చిన్ టెండూల్క‌ర్ – 200 టెస్టుల్లో 69 సిక్స‌ర్లు

నాలుగో ప్లేయ‌ర్‌గా..

అఫ్గాన్ టెస్టులో పంత్ 6 సిక్స‌ర్లు కొడితే మ‌రో రికార్డును అందుకుంటాడు. ఓవ‌రాల్‌గా టెస్టు క్రికెట్‌లో 100 సిక్స‌ర్లు బాదిన నాలుగో ప్లేయ‌ర్‌గా రికార్డుకు ఎక్కుతాడు. బెన్‌స్టోక్స్‌, బ్రెండ‌న్ మెక్‌క‌ల్ల‌మ్‌, ఆడ‌మ్ గిల్ క్రిస్ట్‌లు మాత్ర‌మే టెస్టుల్లో 100 సిక్స‌ర్ల మైలురాయిని చేరుకున్నారు.

*Vaibhav Sooryavanshi : లార్డ్స్‌లో ఇంగ్లాండ్ వ‌ర్సెస్ న్యూజిలాండ్ మ్యాచ్‌లో వైభ‌వ్ సూర్య‌వంశీ గురించి చ‌ర్చ‌.. వీడియో వైర‌ల్‌..

టెస్టుల్లో అత్య‌ధిక సిక్స‌ర్లు కొట్టిన ప్లేయ‌ర్లు వీరే..

* బెన్‌స్టోక్స్ – 121 మ్యాచ్‌ల్లో 136 సిక్స‌ర్లు
* బ్రెండ‌న్ మెక్‌క‌ల్ల‌మ్ – 101 మ్యాచ్‌ల్లో 107 సిక్స‌ర్లు
* ఆడ‌మ్ గిల్ క్రిస్ట్ – 96 మ్యాచ్‌ల్లో 100 సిక్స‌ర్లు
* టిమ్ సౌథీ – 107 మ్యాచ్‌ల్లో 98 సిక్స‌ర్లు
* క్రిస్ గేల్ – 103 మ్యాచ్‌ల్లో 98 సిక్స‌ర్లు
* జాక్వెస్ క‌లిస్ – 166 మ్యాచ్‌ల్లో 97 సిక్స‌ర్లు
* రిష‌బ్ పంత్ – 49 మ్యాచ్‌ల్లో 94 సిక్స‌ర్లు