×
Ad

Rajasthan Royals : రాజ‌స్థాన్ రాయ‌ల్స్ కొత్త కెప్టెన్‌గా రియాన్ ప‌రాగ్‌.. సోష‌ల్ మీడియాలో ఆర్ఆర్ ఆస‌క్తిక‌ర పోస్టు..

రియాన్ ప‌రాగ్‌ రాజ‌స్థాన్ రాయ‌ల్స్ కొత్త కెప్టెన్‌గా (Rajasthan Royals ) నియ‌మితుల‌య్యాడు.

Riyan Parag has been appointed captain of the Rajasthan Royals ahead of IPL 2026

Rajasthan Royals : ఐపీఎల్ 2026 సీజ‌న్‌కు ముందు రియాన్ ప‌రాగ్‌ రాజ‌స్థాన్ రాయ‌ల్స్ కొత్త కెప్టెన్‌గా నియ‌మితుల‌య్యాడు. ఈ విష‌యాన్ని రాజ‌స్థాన్ రాయ‌ల్స్ సోష‌ల్ మీడియా వేదిక‌గా వెల్ల‌డించింది. కొత్త కెప్టెన్ అంటూ రియాన్ ప‌రాగ్ ఫోటోను షేర్ చేసింది. రాయల్స్ కుటుంబం.. మీ కొత్త కెప్టెన్‌కి మద్దతు ఇవ్వాల్సిన సమయం ఆసన్నమైంది అంటూ రాసుకొచ్చింది.

2019లో ఐపీఎల్‌లోకి అడుగుపెట్టాడు రియాన్ ప‌రాగ్‌. అప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు అత‌డు రాజ‌స్థాన్ రాయ‌ల్స్ త‌రుపునే ఆడుతున్నాడు. ఏడు సీజ‌న్ల‌లో జ‌ట్టులో కీల‌క ప్లేయ‌ర్‌గా ఎదిగాడు. ఐపీఎల్ 2025 సీజ‌న్‌లో రెగ్యుల‌ర్ కెప్టెన్ సంజూ శాంస‌న్ గాయ‌ప‌డ‌డంతో తాత్కాలిక సార‌థిగా బాధ్య‌త‌లు చేప‌ట్టాడు.

AUS vs ZIM : ‘ఆ ఒక్క త‌ప్పిదంతోనే ఓడిపోయాం.. లేదంటేనా..’ జింబాబ్వేతో ఓట‌మి పై ఆస్ట్రేలియా తాత్కాలిక కెప్టెన్‌ ట్రావిస్ హెడ్ కామెంట్స్‌..

8 మ్యాచుల‌కు నాయ‌క‌త్వం వ‌హించాడు. ఇందులో రెండు మ్యాచ్‌ల్లో జ‌ట్టును గెలిపించాడు. సార‌థిగా కాస్త విఫ‌ల‌మైన‌ప్ప‌టికి కూడా ఈ మ్యాచ్‌ల్లో అత‌డు 38.57 స‌గ‌టుతో ప‌రుగులు రాబ‌ట్ట‌డం విశేషం. ముఖ్యంగా కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో కెరీర్ అత్యుత్త‌మ స్కోరు 95 ప‌రుగులు సాధించాడు.

మొత్తం మీదు రియాన్ ప‌రాగ్ ఇప్ప‌టి వ‌ర‌కు 84 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడాడు. 141.84 స్ట్రైక్‌రేటుతో 1566 ప‌రుగులు చేశాడు. ముఖ్యంగా ఐపీఎల్ 2024 సీజ‌న్‌లో విజృంభించి ఆడాడు. 149.21 స్ట్రైక్‌రేటుతో 573 ప‌రుగులు సాధించాడు. గ‌త సీజ‌న్‌లో 166.52 స్ట్రైక్‌రేటుతో 393 ప‌రుగులు సాధించాడు.

Arshdeep Singh : టీ20ల్లో 250వ వికెట్.. క్రిస్టియానో ​​రొనాల్డో స్టైల్‌లో అర్ష్‌దీప్ సింగ్ ‘సుయ్’ సెల‌బ్రేష‌న్స్‌..

ఐపీఎల్ 2025 సీజ‌న్ త‌రువాత రాహుల్ ద్ర‌విడ్ హెడ్ కోచ్ ప‌ద‌వి నుంచి త‌ప్పుకోగా, రెగ్యుల‌ర్ కెప్టెన్ సంజూ శాంస‌న్ ట్రేడింగ్‌లో చెన్నై సూప‌ర్ కింగ్స్‌కు వెళ్లిపోయాడు. ఈ క్ర‌మంలో హెడ్‌కోచ్‌గా కుమార సంగ‌క్క‌ర బాధ్య‌త‌లు స్వీక‌రించ‌గా, కెప్టెన్‌గా ప‌రాగ్ ఎంపిక‌య్యాడు. వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో ఐపీఎల్ 2026 సీజ‌న్‌లో రాజ‌స్థాన్ రాయ‌ల్స్ ఎలాంటి ప్ర‌ద‌ర్శ‌న చేస్తుందో వేచి చూడాల్సిందే.