Rohit Sharma : రోహిత్ శ‌ర్మ ఇలాంటి రికార్డు నీకు అవ‌స‌ర‌మా?

ముంబై ఇండియ‌న్స్ స్టార్ ఆట‌గాడు రోహిత్ శ‌ర్మ ఐపీఎల్‌లో ఓ చెత్త రికార్డును న‌మోదు చేశాడు.

Rohit equals Karthik for unwanted record

Rohit Sharma – Dinesh Karthik : ముంబై ఇండియ‌న్స్ స్టార్ ఆట‌గాడు రోహిత్ శ‌ర్మ ఐపీఎల్‌లో ఓ చెత్త రికార్డును న‌మోదు చేశాడు. 17 ఏళ్ల ఐపీఎల్ చ‌రిత్ర‌లో అత్య‌ధిక సార్లు డ‌కౌట్ అయిన బ్యాట‌ర్‌గా అప్ర‌తిష్ట‌ను మూట‌గ‌ట్టుకున్నాడు. సోమ‌వారం ముంబైలోని వాంఖ‌డే స్టేడియంలో రాజ‌స్థాన్ రాయ‌ల్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో అత‌డి ఖాతాలో ఈ చెత్త రికార్డు వ‌చ్చి చేరింది. ఈ మ్యాచ్‌లో హిట్‌మ్యాన్ గోల్డెన్ డ‌క్‌గా పెవిలియ‌న్‌కు చేరుకున్నాడు.

రాజ‌స్థాన్ స్టార్ బౌల‌ర్ ట్రెంట్ బౌల్డ్ బౌలింగ్‌లో వికెట్ కీప‌ర్ సంజూ శాంస‌న్ క్యాచ్ అందుకోవ‌డంతో రోహిత్ శ‌ర్మ తొలి బంతికే ప‌రుగులు ఏమీ చేయ‌కుండా ఔట్ అయ్యాడు. దీంతో ఐపీఎల్ చ‌రిత్ర‌లో అత్య‌ధిక సార్లు డ‌కౌట్ అయిన దినేశ్ కార్తీక్ రికార్డును రోహిత్ శ‌ర్మ స‌మం చేశాడు. ఇప్ప‌టి వ‌ర‌కు కార్తీక్ ఐపీఎల్‌లో 17 సార్లు డ‌కౌట్ కాగా తాజా మ్యాచ్‌తో క‌లిపి హిట్‌మ్యాన్ సైతం 17 సార్లు ప‌రుగులు ఏమీ చేయ‌కుండానే పెవిలియ‌న్‌కు చేరుకున్నాడు. ఇక ఈ జాబితాలో వీరిద్ద‌రి త‌రువాతి స్థానంలో ఆర్‌సీబీ ఆట‌గాడు గ్లెన్ మాక్స్‌వెల్ (15) ఉన్నాడు.

ఐపీఎల్‌లో అత్యధిక సార్లు డకౌట్లైన ఆటగాళ్లు వీరే..
రోహిత్ శర్మ (17)
దినేష్ కార్తీక్ (17)
గ్లెన్ మాక్స్‌వెల్ (15)
పీయూష్ చావ్లా (15)
మన్‌దీప్ సింగ్ (15)
సునీల్ నరైన్ (15)

BAN vs SL : కామెడీ ఎర్ర‌ర్స్‌.. ఒక్క క్యాచ్.. ముగ్గురు స్లిప్ ఫిల్డ‌ర్లు.. న‌వ్వులే న‌వ్వులు

ఇక మ్యాచ్ విష‌యానికి వ‌స్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 9 వికెట్లు కోల్పోయి 125 ప‌రుగులు చేసింది. ముంబై బ్యాట‌ర్ల‌లో రోహిత్ శర్మ(0), నమన్ ధిర్(0), ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చిన డెవాల్డ్ బ్రెవిస్(0) లు గోల్డెన్ డ‌క్‌గా ఔట్ కాగా.. కెప్టెన్ హార్దిక్ పాండ్యా (34), తిలక్ వర్మ(32) లు రాణించారు. రాజ‌స్థాన్ బౌల‌ర్ల‌లో ట్రెంట్ బౌల్ట్, చాహ‌ల్ చెరో మూడు వికెట్లు తీశారు. నండ్రే బర్గర్ రెండు, ఆవేశ్ ఖాన్ ఓ వికెట్ ప‌డ‌గొట్టారు.

స్వ‌ల్ప ల‌క్ష్యాన్ని రాజ‌స్థాన్ 15.3 ఓవ‌ర్ల‌లో నాలుగు వికెట్లు కోల్పోయి ఛేదించింది. రాజ‌స్థాన్ బ్యాట‌ర్ల‌లో య‌శ‌స్వి జైస్వాల్ (10), బ‌ట్ల‌ర్ (13) లు విఫ‌లం అయినా రియాన్ ప‌రాగ్ (54నాటౌట్‌) హాఫ్ సెంచ‌రీతో జ‌ట్టును గెలిపించాడు.

ట్రెండింగ్ వార్తలు