Rohit Sharma : రోహిత్ భ‌య్యా.. నీలో ఈ టాలెంట్ కూడా ఉందా! నువ్వులే న‌వ్వుల్

విధ్వంస‌క‌ర బ్యాట‌ర్ల‌లో టీమ్ఇండియా కెప్టెన్, హిట్‌మ్యాన్ రోహిత్ శ‌ర్మ ఒక‌డు.

Rohit Sharma Copies Yashasvi Jaiswal's Celebration

Rohit Sharma – Yashasvi Jaiswal : విధ్వంస‌క‌ర బ్యాట‌ర్ల‌లో టీమ్ఇండియా కెప్టెన్, హిట్‌మ్యాన్ రోహిత్ శ‌ర్మ ఒక‌డు. ఎలాంటి ప‌రిస్థితుల్లోనైనా త‌న‌దైన శైలిలో హిట్టింగ్ చేస్తూ ప‌రుగుల‌ వ‌ర‌ద పారిస్తుంటాడు. మైదానంలో ఒక్కొసారి ఈ కెప్టెన్ స‌హ‌నం కోల్పోతుండ‌డాన్ని చూస్తూనే ఉంటాం. ఆట‌లో భాగంగా ఇలా జ‌రుగుతుంద‌నే విష‌యం అంద‌రికీ తెలిసిందే. కాగా.. మైదానం బ‌య‌ట మాత్రం చాలా స‌ర‌దాగా ఉంటాడని స‌హ‌చ‌రుల‌తో చాలా మంది చెబుతుంటారు. విలేక‌రుల స‌మావేశాల్లో అడిగిన ప్ర‌శ్న‌ల‌కు కొన్ని సార్లు రోహిత్ చెప్పే స‌మాధానం అక్క‌డ న‌వ్వులు పూయిస్తుంటుంది.

తాజాగా రాజ్‌కోట్ వేదిక‌గా ఇంగ్లాండ్‌తో జ‌రిగిన టెస్టు మ్యాచ్‌లో రోహిత్ శ‌ర్మ చేసిన ఓ ప‌ని నెట్టింట వైర‌ల్‌గా మారింది. యువ ఆట‌గాడు య‌శ‌స్వి జైస్వాల్ సెంచ‌రీ సెల‌బ్రేష‌న్స్‌ను హిట్‌మ్యాన్ అనుక‌రించాడు.

IND vs ENG : గెలుపు జోష్‌లో ఉన్న భార‌త్‌కు షాక్‌..!

ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌లో యువ ఓపెన‌ర్ య‌శ‌స్వి జైస్వాల్ అద‌ర‌గొడుతున్నాడు. వ‌రుస‌గా రెండు మ్యాచుల్లో డ‌బుల్ సెంచ‌రీలు బాదాడు. త‌న‌దైన విధ్వంస‌క‌ర బ్యాటింగ్‌తో ఇంగ్లాండ్ బౌల‌ర్ల‌కు చుక్క‌లు చూపించాడు. విశాఖ‌లో 209 ప‌రుగులు చేసిన జైస్వాల్‌, రాజ్‌కోట్‌లో 216 ప‌రుగుల‌తో అజేయంగా నిలిచాడు. ఈ మ్యాచ్‌లో సెంచ‌రీ త‌రువాత జైస్వాల్ గాల్లోకి పంచ్‌లు ఇస్తూ త‌న‌దైన శైలిలో సెల‌బ్రేష‌న్స్ చేసుకున్నాడు.

ఆ త‌రువాత ప్రేక్ష‌కుల వైపు చూస్తూ గాల్లోకి ముద్దులు ఇచ్చాడు. దీన్ని డ్రెస్సింగ్ రూమ్‌లోంచి రోహిత్ శ‌ర్మ చూశాడు. సెంచ‌రీ చేసినందుకు జైస్వాల్‌ను అభినందిస్తూనే అత‌డి సెల‌బ్రేష‌న్స్‌ను అనుక‌రించాడు. రోహిత్ సైతం అంద‌రి వైపు చూస్తూ గాల్లోకి ముద్దులు ఇచ్చాడు. దీంతో డ్రెస్సింగ్ రూమ్‌లో న‌వ్వులు విర‌బూశాయి. ఈ వీడియో వైర‌ల్‌గా మార‌గా నెటిజ‌న్లు త‌మ‌దైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు.

Ravindra Jadeja : రాజ్‌కోట్‌లో చిరు ఇంద్ర సినిమా సీన్‌.. జ‌డేజా యాక్ష‌న్ వేరేలెవ‌ల్!

ట్రెండింగ్ వార్తలు