Rohit Sharma : హిట్‌మ్యాన్ విశ్వరూపం.. రోహిత్ శర్మ ఖాతాలో మరో చారిత్రక రికార్డు! సచిన్ రికార్డు బద్దలు.. కోహ్లీ మాత్రం..
Rohit Sharma 12000 ODI Runs : వెస్టిండీస్ జట్టుతో గువాహటి వేదికగా జరిగిన రెండో వన్డేలో రోహిత్ శర్మ బ్యాటుతో అదరగొట్టాడు. ఈ క్రమంలో సచిన్ టెండూల్కర్ రికార్డును అధిగమించాడు.
- Harish Thanniru
- Updated on- October 1, 2026 / 06:46 AM IST
Rohit Sharma
Rohit Sharma 12000 ODI Runs : హిట్‌మ్యాన్ చానాళ్ల తరువాత తన విశ్వరూపం చూపించాడు. వెస్టిండీస్ జట్టుతో జరిగిన రెండో వన్డేలో మైదానంలో నలువైపుల బౌండరీల వర్షం కురిపిస్తూ సెంచరీతో రోహిత్ శర్మ సరికొత్త రికార్డులను నమోదు చేశాడు. ఈ క్రమంలో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ రికార్డును రోహిత్ అధిగమించాడు.
Also Read : Shubman Gill : చరిత్ర సృష్టించిన శుభ్‌మన్ గిల్.. విండీస్‌తో మ్యాచ్‌లో గిల్ సాధించిన కీలక రికార్డులు ఇవే..
వెస్టిండీస్ జట్టుతో గువాహటి వేదికగా జరిగిన రెండో వన్డేలో రోహిత్ శర్మ బ్యాటుతో అదరగొట్టాడు. ఒకవైపు శుభ్‌మన్ గిల్ డబుల్ సెంచరీతో చరిత్ర సృష్టిస్తే.. మరోవైపు రోహిత్ శర్మ కూడా సెంచరీ పూర్తి చేయడం ద్వారా అరుదైన ఘనతను అందుకున్నాడు. 12వేల వన్డే పరుగుల మైలురాయిని చేరుకోవడంతోపాటు సచిన్ టెండూల్కర్ రికార్డును అధిగమించాడు
వెస్టిండీస్ జట్టు నిర్దేశించిన 406 పరుగుల భారీ లక్ష్యాన్ని భారత్ ఛేదిస్తున్న సమయంలో రోహిత్ శర్మ 12,000 వన్డే పరుగుల మార్క్‌ను అందుకున్నాడు. దీంతో ఈ ఘనత సాధించిన మూడో భారత బ్యాటర్‌గా రోహిత్ నిలిచాడు. అతడి కంటే ముందు సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ ఈ మైలురాయిని అందుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా 12వేల వన్డే పరుగులు సాధించిన ఏడో బ్యాటర్‌గా కూడా రోహిత్ రికార్డు సృష్టించాడు.
12వేల వన్డే పరుగులను రోహిత్ శర్మ 282 ఇన్నింగ్స్‌ల్లో పూర్తి చేశాడు. సచిన్ టెండూల్కర్ ఈ మైలురాయిని చేరుకోవడానికి 300 ఇన్నింగ్స్‌లు ఆడాడు. దీంతో సచిన్ కంటే 18 ఇన్నింగ్స్‌ల ముందుగానే హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ ఈ ఘనత సాధించాడు. ఇక విరాట్ కోహ్లీ 242 ఇన్నింగ్స్‌ల్లోనే 12 వేల పరుగులు పూర్తి చేసి ఈ జాబితాలో ముందున్నాడు.
1️⃣2️⃣,0️⃣0️⃣0️⃣ and he keeps going strong 💪🙌#TeamIndia great Rohit Sharma becomes the 3️⃣rd Indian to get to this 𝗠𝗔𝗝𝗢𝗥 𝗠𝗜𝗟𝗘𝗦𝗧𝗢𝗡𝗘 🫡
Updates ▶️ https://t.co/6XCYRtZLAi#INDvWI | @mflone_ | @ImRo45 pic.twitter.com/Ov3O2Y34Jz
— BCCI (@BCCI) September 30, 2026
12వేల పరుగుల మైలురాయితో ఆగని రోహిత్.. వెస్టిండీస్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. కేవలం 72 బంతుల్లో సెంచరీ సాధించాడు. ఇది వన్డేల్లో రోహిత్‌కు 35వ సెంచరీ. చివరకు 75 బంతుల్లో 101 పరుగులు చేసి ఔటయ్యాడు. అతడి ఇన్నింగ్స్‌లో 10 ఫోర్లు, 6 సిక్సర్లు ఉన్నాయి.
ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ జట్టు 50 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 405 పరుగులు చేసింది. భారీ లక్ష్యాన్ని భారత్ కేవలం 43.3 ఓవర్లలోనే 2 వికెట్లు కోల్పోయి అధిగమించింది. దీంతో భారత్ 8 వికెట్ల తేడాతో గెలిచింది. మూడు వన్డే మ్యాచ్ ల సిరీస్ లో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 2-0తో భారత జట్టు కైవసం చేసుకుంది.
Make that 3️⃣5️⃣ ODI HUNDREDS for Rohit Sharma 💯
An absolutely scintillating effort to power the chase 🙇♂️
Updates ▶️ https://t.co/6XCYRtZLAi#TeamIndia | #INDvWI | @mflone_ | @ImRo45 pic.twitter.com/MyrTT61yyG
— BCCI (@BCCI) September 30, 2026
