Rohit Sharma : అఫ్గాన్‌తో రెండో టీ20.. చరిత్ర సృష్టించనున్న రోహిత్.. కోహ్లీ అందుకోవడం కష్టమే..!
టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఓ అరుదైన ఘనతను అందుకోనున్నాడు.
- Thota Vamshi Kumar
- Published On : January 13, 2024 / 02:36 PM IST
Rohit Sharma On Verge Of Sensational T20I Achievement
Rohit Sharma : టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఓ అరుదైన ఘనతను అందుకోనున్నాడు. అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో ఇప్పటి వరకు ఏ ఆటగాడు కూడా ఈ రికార్డును అందుకోలేదు. ఈ రికార్డు సాధించేందుకు హిట్‌మ్యాన్ అడుగు దూరంలో ఉన్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో 150 టీ20 మ్యాచులు ఆడిన మొదటి క్రికెటర్‌గా చరిత్ర సృష్టించనున్నాడు. ఇండోర్ వేదికగా ఆదివారం అఫ్గానిస్తాన్‌తో జరగనున్న రెండో టీ20 మ్యాచు ద్వారా రోహిత్ ఈ ఘనత అందుకోనున్నాడు. ఇక ఈ జాబితాలో విరాట్ కోహ్లీ 11వ స్థానంలో ఉన్నాడు. విరాట్ ఇప్పటి వరకు 115 మ్యాచులు ఆడాడు.
ఇదిలా ఉంటే.. దాదాపు 14 నెలల విరామం తరువాత రోహిత్ శర్మ టీమ్ఇండియా తరుపున టీ20 మ్యాచ్ ఆడాడు. అయితే.. తొలి టీ20 మ్యాచులో రోహిత్ శర్మ దురదృష్టవశాత్తు రనౌట్ అయ్యాడు. ఈ క్రమంలో ఇండోర్ వేదికగా జరగనున్న రెండో టీ20లో రోహిత్ శర్మ విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాలని అభిమానులు కోరుకుంటున్నారు. కాగా.. టీ20 క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన రెండో ఆటగాడిగా రోహిత్ శర్మ(3853) కొనసాగుతున్నాడు.
అంతర్జాతీయ టీ20లలో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన క్రికెటర్లు వీరే..
రోహిత్ శర్మ (భారత్) – 149 మ్యాచులు
పాల్ స్టిర్లింగ్ (ఐర్లాండ్) – 134
జార్జ్ డాక్రెల్ (ఐర్లాండ్) – 128
షోయబ్ మాలిక్ (పాకిస్తాన్) – 124
మార్టిన్ గప్టిల్ (న్యూజిలాండ్) – 122
