అంబానీ ఇంట్లో ప్రీవెడ్డింగ్ వేడుకలో జహీర్ ఖాన్‌ను ఆట‌ప‌ట్టించిన రోహిత్ శర్మ.. వీడియో వైరల్

రోహిత్ శర్మ అతని సతీమణి రితికాతో ప్రీ వెడ్డింగ్ వేడుకకు హాజరయ్యారు. అప్పటికే అక్కడ జహీర్ ఖాన్, సూర్యకుమార్ యాదవ్ లు కుటుంబ సభ్యులతో ఉన్నారు.

Rohit Sharma – Zaheer Khan : భారత సంపన్నుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధిపతి ముకేశ్ అంబానీ చిన్నకుమారుడు అనంత్ అంబానీ – రాధిక మర్చంట్ ప్రీ వెండ్డింగ్ వేడుకలు గ్రాండ్ గా జరుగుతున్నాయి. గుజరాత్ లోని జామ్‌నగర్లో జరుగుతున్న వేడుకల్లో వివిధే దేశాల ప్రముఖులతో పాటు సినీ, వ్యాపార, క్రీడా ప్రముఖులు పాల్గొన్నారు. సచిన్ టెండూల్కర్, ఎంఎస్ ధోనీ, రోహిత్ శర్మ, జహీర్ ఖాన్, సూర్యకుమార్ యాదవ్ లతో పాటు ఐపీఎల్ లో ముంబై టీం సభ్యులు, ఇతర క్రీడా ప్రముఖులు పాల్గొన్నారు. ఒకరినొకరు ఆప్యాయంగా పలుకురించారు. ఈ సందర్భంగా టీమిండియా మాజీ ఫాస్ట్ బౌలర్ జహీర్ ఖాన్ ను ప్రస్తుత టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఆటపట్టించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Also Read : బీసీసీఐ ఇచ్చిన ఆఫర్‌ను తిరస్కరించిన ఇషాన్ కిషన్.. అందుకే ఇలా?

రోహిత్ శర్మ అతని సతీమణి రితికాతో ప్రీ వెడ్డింగ్ వేడుకకు హాజరయ్యారు. అప్పటికే అక్కడ జహీర్ ఖాన్, సూర్యకుమార్ యాదవ్ లు వారి సతీమణిలు ఉన్నారు. రితికా జహీర్ ఖాన్ సతీమణితో మాట్లాడుతున్న క్రమంలో రోహిత్ వెనుకనుంచి వచ్చి జహీర్ ను గట్టిగా కౌగిలించుకున్నాడు. దీంతో వారి మధ్య సరదాసన్నివేశం సాగింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. గతవారం రాంచీలో ఇంగ్లండ్ తో జరిగిన నాల్గో టెస్టులో రోహిత్ సారథ్యంలోని టీమిండియా విజయం సాధించింది. దీంతో ఐదు మ్యాచ్ ల టెస్ట సిరీస్ లో మరో మ్యాచ్ మిగిలిఉండగానే 3-1తో టీమిండియా సిరీస్ ను కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. ఐదో టెస్ట్ మ్యాచ్ ఈనెల 7 నుంచి ధర్మశాలలో ప్రారంభం కానుంది.

Also Read : గౌతమ్ గంభీర్ అనూహ్య నిర్ణయం.. యాక్టివ్ పాలిటిక్స్‌కు గుడ్‌బై!

ఇంగ్లాండ్ తో ఐదో టెస్టుకు సమయం ఉండటంతో రోహిత్, ఇతర టీమిండియా క్రికెటర్లు అంబాని ఇంట్లో ఫ్రీ వెడ్డింగ్ వేడుకలో పాల్గొన్నారు. భారత్ కెప్టెన్ రోహిత్ శర్మకు అంబానీ కుటుంబంతో స్నేహపూర్వక సంబంధం ఉంది. ఐపీఎలో అంబానీ కుటుంబం ప్రాంచైజీగా ఉన్న ముంబై ఇండియన్స్ జట్టుకు గత సీజన్ వరకు రోహిత్ శర్మనే కెప్టెన్ గా కొనసాగారు. రోహిత్ సారథ్యంలో ముంబై ఇండియన్స్ ఐదుసార్లు టోర్నీ విజేతగా నిలిచింది.

 

 

ట్రెండింగ్ వార్తలు