T20 World Cup 2026 : భారత్‌తో మ్యాచ్ ఆడొద్దనన్న పాక్ ప్రభుత్వం.. బీసీసీఐ కీలక నిర్ణయం.. శ్రీలంకకు టీమ్ఇండియా..!
టీ20 ప్రపంచకప్ 2026లో (T20 World Cup 2026) భారత్‌తో మ్యాచ్‌ను బహిష్కరించాలని పాక్ ప్రభుత్వం నిర్ణయం నేపథ్యంలో బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది.
BCCI Takes Key decision Stand On Pakistan T20 World Cup Boycott Decision Report
T20 World Cup 2026 : టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా శ్రీలంకలోని ప్రేమదాస స్టేడియంలో ఫిబ్రవరి 15న భారత్, పాక్ జట్ల మధ్య మ్యాచ్ జరగాల్సి ఉంది. అయితే.. ఈ మ్యాచ్‌ను బహిష్కరించాలని తమ దేశ క్రికెట్ జట్టుకు పాక్ ప్రభుత్వం సూచించింది. దీంతో ఈ మ్యాచ్ పై ప్రస్తుతం అనిశ్చితి నెలకొంది. అయితే.. ఈ మ్యాచ్‌ను బాయ్‌కాట్ చేస్తున్నట్లుగా ఇప్పటి వరకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అధికారికంగా ఐసీసీకి తెలియజేయలేదు.
దీంతో పాక్ జట్టు ఈ మ్యాచ్‌ను బహిష్కరిస్తుందా? లేదా? అన్నది కూడా అనుమానంగా మారింది. ఒకవేళ పాక్ ఈ మ్యాచ్‌ను బహిష్కరిస్తే అప్పుడు భారత్ ఖాతాలో రెండు పాయింట్లు వచ్చి చేరతాయి.
పాక్ ప్రభుత్వం మ్యాచ్‌ను బహిష్కరించాలని చెబుతున్న నేపథ్యంలో బీసీసీఐ ఓ కీలక నిర్ణయం తీసుకున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఐసీసీ ప్రొటోకాల్స్ ఫాలో కావాలని నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో షెడ్యూల్ ప్రకారం భారత జట్టు శ్రీలంకకు వెళ్లనుందని తెలుస్తోంది. అదే విధంగా ప్రాక్టీస్ సెషన్లలోనూ పాల్గొనున్నట్లు సమాచారం. అంతేకాదండోయ్ మ్యాచ్‌కు ముందు నిర్వహించే విలేకరుల సమావేశంలోనూ భారత్ పాల్గొననుందట.
ఇక మ్యాచ్ రోజు ఆటగాళ్లు నిర్ణీత సమయానికి మైదానానికి చేరుకుని వేచి చూడనున్నారని తెలుస్తోంది. పాక్ జట్టు మైదానంలోకి రాకుంటే అప్పుడు మ్యాచ్ రిఫరీ తీసుకునే నిర్ణయం కోసం టీమ్ఇండియా ఎదురుచూడనుందని తెలుస్తోంది.
ICC : భారత్‌తో ఆడొద్దు.. పాక్ ప్రభుత్వ నిర్ణయం పై ఐసీసీ రియాక్షన్ ఇదే .. అలా చేస్తే..
ఇదిలా ఉంటే.. ఒకవేళ భారత్, పాక్ జట్టు నాకౌట్లో మరోసారి తలపడాల్సి వస్తే.. పరిస్థితి ఏంటి అనే దానిపై ఇప్పటికైతే పాక్ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పష్టత లేదు.
