Ryan Rickelton : ర్యాన్ రికెల్ట‌న్ నువ్వు మామూలోడివి కాద‌య్యా.. ఒక్క సెంచ‌రీతో 19 ఏళ్ల ముంబై ఇండియ‌న్స్ రికార్డులు బ‌ద్ద‌లు కొట్టావుగా..

ముంబై ఇండియ‌న్స్ ఓపెన‌ర్ ర్యాన్ రికెల్ట‌న్ (Ryan Rickelton)అరుదైన ఘ‌న‌త సాధించాడు.

Ryan Rickelton creates history became fastest century in Mumbai Indians history (pic credit@ipl)

  • 44 బంతుల్లోనే శ‌త‌క్కొట్టిన ర్యాన్ రికెల్ట‌న్‌
  • ఐపీఎల్‌లో ముంబై ఇండియ‌న్స్ త‌రుపున ఇదే ఫాస్టెస్ట్ సెంచ‌రీ

Ryan Rickelton : ముంబై ఇండియ‌న్స్ ఓపెన‌ర్ ర్యాన్ రికెల్ట‌న్ అరుదైన ఘ‌న‌త సాధించాడు. బుధ‌వారం వాంఖ‌డే వేదిక‌గా స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో శ‌త‌కంతో చెల‌రేగాడు. కేవ‌లం 44 బంతుల్లోనే అత‌డు మూడు అంకెల స్కోరు అందుకున్నాడు. ఈ క్ర‌మంలో ఐపీఎల్‌లో ముంబై ఇండియ‌న్స్ త‌రుపున అత్యంత వేగంగా సెంచ‌రీ చేసిన ఆట‌గాడిగా చ‌రిత్ర సృష్టించాడు.

ఈ క్ర‌మంలో అత‌డు స‌నత్ జ‌య‌సూర్య‌ను అధిగ‌మించాడు. ఐపీఎల్ ఆరంభ సీజ‌న్ (2008)లో ముంబై త‌రుపున ఆడుతూ స‌న‌త్ జ‌య‌సూర్య చెన్నై సూప‌ర్ కింగ్స్ పై 45 బంతుల్లో సెంచ‌రీ చేశాడు.

Hardik Pandya : హార్దిక్ పాండ్యా ఇదేం కెప్టెన్సీ.. ఇంపాక్ట్ ప్లేయ‌ర్‌ను ఎందుకు తీసుకున్నావ్‌.. ఐపీఎల్ చ‌రిత్ర‌లోనే తొలిసారి ఇలా..

ఐపీఎల్‌లో ముంబై త‌రుపున వేగ‌వంత‌మైన సెంచ‌రీ చేసిన ఆట‌గాళ్లు వీరే..

* ర్యాన్ రికెల్ట‌న్ – 44 బంతులు
* స‌న‌త్ జ‌య‌సూర్య – 45 బంతులు
* తిల‌క్ వ‌ర్మ – 45 బంతులు
* కామెరూన్ గ్రీన్ – 47 బంతులు

ఇక ఈ మ్యాచ్‌లో మొత్తంగా ర్యాన్ రికెల్ట‌న్ 55 బంతులు ఎదుర్కొన్నాడు. 10 ఫోర్లు, 8 సిక్స‌ర్ల సాయంతో 123 ప‌రుగుల‌తో అజేయంగా నిలిచాడు. ఈ క్ర‌మంలో ముంబై ఇండియ‌న్స్ త‌రుపున అత్య‌ధిక ప‌రుగులు చేసిన ఆట‌గాడిగా రికార్డుల‌కు ఎక్కాడు. గ‌తంలో ఈ రికార్డు స‌న‌త్ జ‌య‌సూర్య పేరిట ఉండేది. 2008లో సీఎస్‌కే పై జ‌య‌సూర్య 114 ప‌రుగుల‌తో అజేయంగా నిలిచాడు.

Mumbai Indians : ముంబై ఇండియ‌న్స్‌ది మామూలు అదృష్టం కాద‌య్యా.. స‌న్‌రైజ‌ర్స్ పై ఓట‌మి.. అయినా గానీ ప్లేఆఫ్స్‌కు వెళ్లొచ్చు..

ఐపీఎల్‌లో ముంబై ఇండియ‌న్స్ త‌రుపున అత్య‌ధిక స్కోరు చేసిన ప్లేయ‌ర్లు వీరే..

* ర్యాన్ రికెల్ట‌న్ – 123* ప‌రుగులు
* స‌న‌త్ జ‌య‌సూర్య – 114 * ప‌రుగులు
* క్వింట‌న్ డికాక్ – 112* ప‌రుగులు
* రోహిత్ శర్మ – 109* ప‌రుగులు
* రోహిత్ శ‌ర్మ – 105* ప‌రుగులు
* సూర్యకుమార్ యాదవ్ – 103* ప‌రుగులు