×
Ad

Sahibzada Farhan : చ‌రిత్ర సృష్టించిన పాక్ ఆట‌గాడు సాహిబ్జాదా ఫర్హాన్.. విరాట్ కోహ్లీ టీ20 ప్ర‌పంచ రికార్డు బ్రేక్‌

పాకిస్థాన్ స్టార్ ఓపెన‌ర్ సాహిబ్జాదా ఫర్హాన్ (Sahibzada Farhan ) అరుదైన ఘ‌న‌త సాధించాడు.

Sahibzada Farhan goes past Virat Kohli to record the most number of runs in a single edition of a T20 WC

Sahibzada Farhan : పాకిస్థాన్ స్టార్ ఓపెన‌ర్ సాహిబ్జాదా ఫర్హాన్ అరుదైన ఘ‌న‌త సాధించాడు. టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌ చ‌రిత్ర‌లో ఓ ఎడిష‌న్‌లో అత్య‌ధిక ప‌రుగులు చేసిన ఆట‌గాడిగా చరిత్ర సృష్టించాడు. శ‌నివారం శ్రీలంక‌తో మ్యాచ్‌లో అత‌డు 37 ప‌రుగుల వ్య‌క్తిగ‌త స్కోరు వ‌ద్ద ఈ ఘ‌న‌త అందుకున్నాడు. ఈ క్ర‌మంలో అత‌డు టీమ్ఇండియా దిగ్గ‌జ ఆట‌గాడు విరాట్ కోహ్లీ రికార్డును బ్రేక్ చేశాడు. 2014 టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌లో కోహ్లీ 319 ప‌రుగులు చేశాడు.

టీ20ప్ర‌పంచ‌క‌ప్ చ‌రిత్ర‌లో ఓ ఎడిష‌న్‌లో అత్య‌ధిక ప‌రుగులు చేసిన ప్లేయ‌ర్లు వీరే..

* సాహిబ్జాదా ఫర్హాన్ (పాకిస్థాన్‌) – 333* ప‌రుగులు (టీ20 ప్ర‌పంచ‌క‌ప్ 2026)
* విరాట్ కోహ్లీ (భార‌త్) – 319 ప‌రుగులు (టీ20 ప్ర‌పంచ‌క‌ప్ 2014లో)
* తిల‌క‌ర‌త్నె దిల్షాన్ (శ్రీలంక‌) – 317 ప‌రుగులు (టీ20 ప్ర‌పంచ‌క‌ప్ 2009లో)
* బాబ‌ర్ ఆజామ్ (పాకిస్థాన్‌) – 303 ప‌రుగులు (టీ20 ప్ర‌పంచ‌క‌ప్ 2021లో)
* మ‌హేలా జ‌య‌వ‌ర్ధ‌నే (శ్రీలంక‌) – 302 ప‌రుగులు (టీ20 ప్ర‌పంచ‌క‌ప్ 2010లో)

IND vs WI : కీల‌క మ్యాచ్ ముందు విండీస్ స్పిన్న‌ర్ కామెంట్స్‌.. టీమ్ఇండియాను చూసి భ‌య‌ప‌డ‌డం లేదు.. ఆ జ‌ట్టులో స్టార్లు లేరు..

అంతేకాదండోయ్.. ఈ మ్యాచ్‌లో 32 బంతుల్లోనే హాఫ్ సెంచ‌రీ పూర్తి చేసుకున్నాడు సాహిబ్జాదా ఫర్హాన్. ఈ క్ర‌మంలో ఓ ప్ర‌పంచ‌క‌ప్ ఎడిష‌న్‌లో అత్య‌ధిక సార్లు 50ఫ్ల‌స్ ర‌న్స్ చేసిన ఆట‌గాడిగానూ సాహిబ్జాదా ఫర్హాన్ నిలిచాడు. మాథ్యూ హెడెన్‌, విరాట్ కోహ్లీ, బాబ‌ర్ ఆజామ్‌ల‌తో క‌లిసి సంయుక్తంగా ఉన్నాడు. వీరింద‌రూ ఓ ఎడిష‌న్‌లో త‌లా 4 సార్లు 50ఫ్ల‌స్ ర‌న్స్ సాధించారు.

ఓ టీ20 ప్ర‌పంచ‌క‌ప్ ఎడిష‌న్‌లో అత్య‌ధిక సార్లు 50 ఫ్ల‌స్ స్కోరు సాధించిన ఆట‌గాళ్లు వీరే..

* మాథ్యూ హెడెన్ (ఆస్ట్రేలియా) – 2007 టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌లో 4 సార్లు
* విరాట్ కోహ్లీ (భార‌త్) – 2014 టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌లో 4 సార్లు
* బాబ‌ర్ ఆజామ్ (పాకిస్థాన్‌) – 2021 టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌లో 4 సార్లు
* విరాట్ కోహ్లీ (భార‌త్) – 2022 టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌లో 4 సార్లు
* సాహిబ్జాదా ఫర్హాన్ (పాకిస్థాన్‌) – 2026 టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌లో 4 సార్లు