BAN vs PAK : సూప‌ర్ ట్విస్ట్.. సాయం చేయ‌బోయే వికెట్ పాయె.. స‌ల్మాన్ అలీ ఫ్యూజులు ఔట్‌

ఢాకా వేదిక‌గా బంగ్లాదేశ్‌తో జ‌రిగిన రెండో వ‌న్డే మ్యాచ్‌లో (BAN vs PAK)పాకిస్థాన్ ఆట‌గాడు సల్మాన్ అలీ అఘా ర‌నౌట్ అయ్యాడు

Salman Ali Agha run out in BAN vs PAK 2nd ODI video viral

BAN vs PAK : ఢాకా వేదిక‌గా బంగ్లాదేశ్‌తో జ‌రిగిన రెండో వ‌న్డే మ్యాచ్‌లో పాకిస్థాన్ ఆట‌గాడు సల్మాన్ అలీ అఘా ర‌నౌట్ అయ్యాడు. అత‌డి ర‌నౌట్ తీవ్ర చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఇది క్రీడా స్ఫూర్తికి విరుద్దం అని కొంద‌రు అంటుండ‌గా, మ‌రికొంద‌రు మాత్రం త‌ప్పు కాద‌ని చెబుతున్నారు.

అస‌లేం జ‌రిగిందంటే?

పాకిస్థాన్ ఇన్నింగ్స్ 39వ ఓవ‌ర్‌లో ఈ ఘ‌ట‌న జ‌రిగింది. ఈ ఓవ‌ర్‌ను బంగ్లా బౌల‌ర్ మోహిదీ హ‌స‌న్ మిరాజ్ వేశాడు. స్ట్రైకింగ్‌లో రిజ్వాన్ ఉండ‌గా, నాన్ స్ట్రైకింగ్ ఎండ్‌లో స‌ల్మాన్ అలీ అఘా ఉన్నాడు. నాలుగో బంతిని రిజ్వాన్ స్ట్రైయిట్ షాట్ ఆడాడు. బంతి నేరుగా వెళ్లి స‌ల్మాన్ షూను తాకి ఆగింది. ఆ వెనుక‌నే ఉన్న బౌల‌ర్ బంతిని అందుకునేందుకు సిద్ధం కాగా.. అప్ప‌టికే కాస్త క్రీజు దాటి ముందుకు ఉన్న స‌ల్మాన్‌.. బాల్‌ను అత‌డికి ఇద్దామ‌ని కింద‌కు వంగాడు.

KKR : ఐపీఎల్ 2026 సీజ‌న్‌కు ముందు కోల్‌క‌తాకు భారీ షాక్‌.. ఇప్పుడేం చేస్తుందో?

ఇంత‌లో మిరాజ్ బంతిని తీసుకుని వికెట్ల‌ను ప‌డ‌గొట్టాడు. ర‌నౌట్ అంటూ అప్పీల్ చేశాడు. మ‌రోవైపు స‌ల్మాన్‌.. తాను బంతి ఇద్దామ‌ని కింద‌కు వంగాన‌ని చెబుతూనే ఉన్నాడు. అదే స‌మ‌యంలో బంగ్లా ఆట‌గాళ్లు అప్పీల్ చేయ‌డంతో ఫీల్డ్ అంఫైర్‌.. థ‌ర్డ్ అంపైర్ సాయం కోరాడు. రిప్లేను ప‌రిశీలించిన థ‌ర్డ్ అంపైర్‌.. స‌ల్మాన్ క్రీజులో లేడు కాబ‌ట్టి ర‌నౌట్ అని ప్ర‌క‌టించాడు. దీంతో 64 ప‌రుగులు చేసి సల్మాన్ ఆగ్ర‌హంతో మైదానాన్ని వీడాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియలో వైర‌ల్ అవుతోంది.

Sara Tendulkar : సోద‌రుడి పెళ్లిలో స‌చిన్ కూతురు సంద‌డి చూశారా? ఫోటోలు వైర‌ల్‌..

ఇది క్రీడా స్ఫూర్తికి విరుద్దం అని కొంద‌రు అంటుండ‌గా మ‌రికొంద‌రు మాత్రం బాల్ డెడ్ కాకుండానే క్రీజు బ‌య‌ట ఎందుకు ఉన్నాడ‌ని ప్ర‌శ్నిస్తున్నారు. మొత్తానికి ఈ వీడియో వైర‌ల్ అవుతుంది.