Sanju Samson : తొలి టీ20 మ్యాచ్‌లో ఘోరంగా విఫలమైన సంజూ శాంసన్.. ఇప్పుడెలా?
ఐర్లాండ్‌తో తొలి టీ20 మ్యాచ్‌లో సంజూ శాంసన్ (Sanju Samson) విఫలం అయ్యాడు.
- Thota Vamshi Kumar
- Published on- June 26, 2026 / 08:26 PM IST
Sanju Samson 1stT20 Fails in IND vs IRE 1stT20
Sanju Samson : ప్రస్తుతం టీమ్ఇండియా టీ20 జట్టులో ఓపెనింగ్ స్థానం కోసం తీవ్ర పోటీ నెలకొంది. యశస్వి జైస్వాల్, ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్‌లతో పాటు 15 ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్యవంశీ ఓపెనింగ్‌లో ఆడేందుకు సిద్ధంగా ఉన్నారు. టీ20 ప్రపంచకప్ 2028, ఒలింపిక్స్ కోసం భారత జట్టును సిద్ధం చేసే పనిలో సెలక్టర్లు ఉన్నారు.
ఓ ఓపెనర్‌గా విధ్వంసకర ఆటగాడు అభిషేక్ శర్మ స్థానం దాదాపుగా ఖాయం. మరో ఓపెనింగ్ స్థానం కోసం పోటీ తీవ్రంగా ఉంది. యశస్వి జైస్వాల్, ఇషాన్ కిషన్‌లు మంచి ఫామ్‌లో ఉన్నారు. ఐపీఎల్‌లో మెరుపులు మెరిపించిన 15 ఏళ్ల బుడ్డోడు వైభవ్ సూర్యవంశీ అరంగ్రేటం కోసం ఎదురుచూస్తున్నాడు. ప్రస్తుతం వన్డే ప్రపంచకప్ 2027 కోసం ఆ ఫార్మాట్‌కే పరిమితమైన గిల్.. ఆ మెగాటోర్నీ తరువాత టీ20 జట్టులోకి రావడం లాంచనమే.
Sanju Samson dismissed for 5 in 4 balls. pic.twitter.com/8ceccORymB
— Mufaddal Vohra (@mufaddal_vohra) June 26, 2026
ఇంత తీవ్ర పోటీ మధ్య అవకాశం దక్కించుకున్న సంజూ శాంసన్ అద్భుతంగా రాణించాల్సిన అవసరం ఉంది. నిలకడగా ఆడుతూ తన ఓపెనింగ్ స్థానం కాపాడుకోవాల్సి ఉండగా.. ఐర్లాండ్‌తో తొలి టీ20 మ్యాచ్‌లో ఘోరంగా విఫలం అయ్యాడు. 4 బంతులు ఎదుర్కొని ఓ ఫోర్ సాయంతో 5 పరుగులు మాత్రమే చేశాడు. అరంగ్రేట ఆటగాడు జై మూంద్ర బౌలింగ్‌లో ఆడిన తొలి బంతికే క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో సంజూ శాంసన్ పై విమర్శల వర్షం కురుస్తోంది. సంజూకు బదులుగా వైభవను ఆడించాలనే డిమాండ్లు మొదలు అయ్యాయి.
