Sanju Samson : వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. సంజూ శాంసన్‌ను ఊరిస్తున్న అరుదైన మైలురాయి..
వెస్టిండీస్‌తో టీ20 సిరీస్‌కు ముందు టీమ్ఇండియా వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్‌ను (Sanju Samson) అరుదైన రికార్డు ఊరిస్తోంది.
Sanju Samson needs 6 more sixes to complete 100 sixes in international T20Is
Sanju Samson : భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య నేటి (అక్టోబర్ 6 మంగళవారం) నుంచి ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆరంభం కానుంది. తొలి టీ20 మ్యాచ్‌కు లక్నోలోని ఎకానా స్టేడియం ఆతిథ్యం ఇవ్వనుంది. కాగా.. ఈ సిరీస్‌కు ముందు టీమ్ఇండియా వికెట్ కీపర్, బ్యాటర్ సంజూ శాంసన్‌ను ఓ అరుదైన మైలురాయి ఊరిస్తోంది. ఈ సిరీస్‌లో సంజూ శాంసన్ 6 సిక్సర్లు కొడితే అంతర్జాతీయ టీ20 క్రికెట్లో 100 సిక్సర్ల మైలురాయిని చేరుకుంటాడు.
అంతర్జాతీయ టీ20 క్రికెట్లో ఇప్పటి వరకు ఐదుగురు భారత బ్యాటర్లు.. రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, అభిషేక్ శర్మ, హార్దిక్ పాండ్యా, విరాట్ కోహ్లీలు మాత్రమే 100 సిక్సర్ల మైలురాయిని చేరుకున్నారు. సంజూ శాంసన్ 6 సిక్సర్లు కొడితే.. ఈ మైలురాయి చేరుకున్న ఆరో ప్లేయర్‌గా రికార్డులకు ఎక్కుతాడు.
Harmanpreet Kaur : హర్మన్ ప్రీత్ కౌర్ సంచలన నిర్ణయం.. కెప్టెన్సీ ముగిసింది.. ఇక ప్రయాణం..
ఇదిలా ఉంటే.. భారత్ తరుపున అంతర్జాతీయ టీ20 క్రికెట్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన రికార్డు రోహిత్ శర్మ పేరిట ఉంది. అతడు159 మ్యాచ్‌ల్లో 205 సిక్సర్లు బాదాడు. 200 సిక్సర్ల క్లబ్లో భారత్ తరుపున హిట్‌మ్యాన్ ఒక్కడే ఉన్నాడు.
ఇక సంజూ శాంసన్ విషయానికి వస్తే.. ఇప్పటి వరకు 72 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. 26.6 సగటుతో 1567 పరుగులు చేశాడు. ఇందులో మూడు శతకాలు, 8 అర్థశతకాలు ఉన్నాయి. మొత్తంగా 132 ఫోర్లు, 94 సిక్సర్లు బాదాడు.
అంతర్జాతీయ టీ20 క్రికెట్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన భారత ప్లేయర్లు వీరే..
* రోహిత్ శర్మ – 159 మ్యాచ్‌ల్లో 205 సిక్సర్లు
* సూర్యకుమార్ యాదవ్ – 113 మ్యాచ్‌ల్లో 179 సిక్సర్లు
* అభిషేక్ శర్మ – 62 మ్యాచ్‌ల్లో 134 సిక్సర్లు
* హార్దిక్ పాండ్యా – 138 మ్యాచ్‌ల్లో 126 సిక్సర్లు
IND vs WI : భారత్ వర్సెస్ వెస్టిండీస్ టీ20 సిరీస్.. సోనీలో రాదు.. ఎక్కడ చూడొచ్చొ తెలుసా?
* విరాట్ కోహ్లీ – 125 మ్యాచ్‌ల్లో 124 సిక్సర్లు
* కేఎల్ రాహుల్ – 72 మ్యాచ్‌ల్లో 99 సిక్సర్లు
* సంజూ శాంసన్ – 72 మ్యాచ్‌ల్లో 94 సిక్సర్లు
