Serena Williams : రెండోసారి పండంటి బిడ్డకు జన్మనిచ్చిన సెరెనా విలియమ్స్.. భర్త ట్వీట్ వైరల్.. అభినందనలు తెలుపుతున్న అభిమానులు
సెరెనా విలియమ్స్ మరోసారి ఆడ బిడ్డకు జన్మనిచ్చింది. తల్లీ, బిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉన్నారంటూ ఆమె భర్త ట్విటర్ ద్వారా తెలిపారు.
- Harish Thanniru
- Updated on- August 23, 2023 / 02:46 PM IST
Serena Williams
Serena Williams : అమెరికాకు చెందిన టెన్నిస్ దిగ్గజం సెరెనా విలియమ్స్ మరోసారి ఆడ బిడ్డకు జన్మనిచ్చింది. ఈ పాపకు అధీరా రివర్ ఒహానియా అని పేరుకూడా పెట్టారు. ఈ విషయాన్ని సెరెనా విలియమ్స్ భర్త, ప్రముఖ పారిశ్రామిక వేత్త అలెక్సిస్ ఒహానియర్ ట్విటర్ వేదికగా తెలిపారు. వెల్కమ్ అధీరా రివర్ ఒహానియా అంటూ ట్వీట్ చేశారు. సెరెనా, తన ఇద్దరు కుమార్తెలతో కలిసి ఉన్న ఫొటోలను షేర్ చేశారు.
తల్లీ, బిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉన్నారు. ఇప్పుడు ఇల్లంతా ఆనందంతో నిండిపోయినట్లు అలెక్సిస్ ఒహానియర్ చెప్పారు. తనకు మరో అద్భుతమైన బహుమతి ఇచ్చావని గ్రేటెస్ట్ మదర్ ఆఫ్ ఆల్‌టైమ్ అంటూ భార్యపై అలెక్సిస్ ప్రశంసలు కురిపించారు. సెరెనా -అలెక్సిస్ కు ఇప్పటికే ఓ పాప ఉంది. రెండో బిడ్డకు జన్మనిచ్చిన సెరెనాకు తోటి క్రీడాకారులు, అభిమానులు అభినందనలు తెలుపుతున్నారు. పోలాండ్ కు చెందిన మహిళల టెన్నిస్ నెం.1 క్రీడాకారిణి ఇగా స్విటెక్ ‘అభినందనలు క్వీన్ వెల్కమ్ బేబీ గర్ల్’ అంటూ ట్వీట్ చేసింది. తోటి క్రీడాకారులతో పాటు అభిమానులు సెరెనాకు అభినందనలు తెలుపుతున్నారు.
సెరెనా విలియమ్స్ కు ఇప్పుడు 41ఏళ్లు. మహిళల సింగిల్స్ లో 23 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ గెలుచుకుంది. ఓపెన్ ఎరాలో అత్యధిక టైటిల్స్ గెలిచిన వారిలో సెరెనా రెండో స్థానంలో నిలిచింది. 319 వారాల పాటు వరల్డ్ నెంబర్ వన్ ర్యాంకులో సెరెనా కొనసాగింది. గతేడాది సెప్టెంబరులో ఆమె టెన్నిస్ నుంచి రిటైర్మెంట్ తీసుకుంది.
