Shahid Afridi : షాహిద్ అఫ్రిది సంచలన వ్యాఖ్యలు.. పాక్ జట్టును నాశనం చేస్తుంది ఎవరంటే..?
అమెరికా, వెస్టిండీస్ దేశాలు ఆతిథ్యం ఇస్తున్న టీ20 ప్రపంచకప్2024లో పాకిస్తాన్ ఇంత వరకు బోణీ కొట్టలేదు
- Thota Vamshi Kumar
- Published On : June 11, 2024 / 03:55 PM IST
Shahid Afridi Pledges Big Expose On Pakistan Team
అమెరికా, వెస్టిండీస్ దేశాలు ఆతిథ్యం ఇస్తున్న టీ20 ప్రపంచకప్2024లో పాకిస్తాన్ ఇంత వరకు బోణీ కొట్టలేదు. ఆడిన రెండు మ్యాచుల్లో అమెరికా, భారత్ చేతుల్లో ఓడిపోయింది. దీంతో ఆ జట్టు సూపర్ 8 అవకాశాలు సంక్లిష్టం అయ్యాయి. ఈ నేపథ్యంలో ఆ జట్టు పై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా మాజీ ఆటగాళ్లు అయితే జట్టు మొత్తాన్ని మార్చేయాలని సూచనలు చేస్తున్నారు. ఈ క్రమంలో మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. పాక్ జట్టులో ఏం జరుగుతుంది అనే విషయాలను టీ20 ప్రపంచకప్ తరువాత బయట పెడతానన్నాడు.
పాక్ కెప్టెన్ బాబర్ ఆజాం గురించి మాట్లాడుతూ.. ఓ నాయకుడు తలుచుకుంటే జట్టు మొత్తాన్ని ఒక్క తాటి మీదికి తేగలడు.. లేదా జట్టును నాశనం చేయగలడని అన్నాడు. ప్రపంచకప్ ముగిసిన తరువాత ఈ విషయం పై మరింత స్పష్టత ఇస్తాను అని అఫ్రిది అన్నాడు. తన అల్లుడు, ఫాస్ట్ బౌలర్ అయిన షాహిన్ అఫ్రిది ఎదుర్కొన్న గడ్డు పరిస్థితులపై ప్రస్తావనకు రాగా షాహిద్ అఫ్రిది ఇలా స్పందించాడు.
Danni Wyatt : ప్రేయసిని పెళ్లాడిన ఇంగ్లాండ్ మహిళా స్టార్ క్రికెటర్.. ఫిక్స్ వైరల్
తాను అతడి గురించి ఏదైన పాజిటివ్‌గా చెబితే, అది అతడితో నాకున్న అనుబంధం వల్లనేనని మీరంతా భావిస్తుంటారు. వాస్తవానికి నేను నా కూతురికి, అల్లుడికి అనుకూలంగా ఎప్పుడు మాట్లాడను. తప్పు చేశారని తెలిస్తే తప్పు చేశారని చెబుతానే తప్ప వారిని వెనుక వేసుకురానని అన్నాడు.
షాహిన్‌ను కెప్టెన్సీ నుంచి తప్పించి..
వన్డే ప్రపంచకప్‌లో దారుణ ఓటమి ఎదురుకావడంతో పాకిస్తాన్ జట్టు కెప్టెన్సీ బాధ్యతల నుంచి బాబర్ ఆజాంను తప్పించారు. ఆ తరువాత టీ20లకు షాహిన్ అఫ్రిదిని సారథిగా ఎంపిక చేశారు. అయితే.. షాహిన్ సారథ్యంలో న్యూజిలాండ్ పర్యటన వెళ్లిన పాక్ అక్కడ ఐదు మ్యాచుల టీ20 సిరీస్‌ను 0-4తో కోల్పోయింది. ఒక్క సిరీస్ ఓడిపోగానే షాహిన్‌ను కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పించిన పాకిస్తాన్ క్రికెట్ బోర్డు టీ20 ప్రపంచకప్‌కు కొద్ది రోజుల ముందు తిరిగి బాబర్ ఆజాంకు నాయకత్వ బాధ్యతలు అప్పగించింది. ఈ క్రమంలో జట్టులో రెండు గ్రూపులు ఏర్పడ్డాయని బాబర్, షాహిన్‌లు మాట్లాడుకోవడం లేదనే వార్తలు వచ్చాయి.
MS Dhoni : పారిస్ వీధుల్లో ఫ్యామిలీతో చక్కర్లు కొడుతున్న ధోని..
