Shreyas Iyer : శ్రేయ‌స్ అయ్య‌ర్ మాస్ వార్నింగ్‌.. నా దృష్టంతా దానిపైనే.. కాస్కోండి..

ఈ సారి క‌ప్పు త‌మ‌దేన‌ని అంటున్నాడు పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయ‌స్ అయ్యర్‌(Shreyas Iyer).

Shreyas Iyer says my eye is on the trophy ahead of IPL 2026

  • మార్చి 28 నుంచి ఐపీఎల్ 2026
  • ఈ సారి క‌ప్పు మాదే అంటున్న శ్రేయ‌స్ అయ్య‌ర్‌

Shreyas Iyer : గ‌తేడాది తృటిలో పంజాబ్ కింగ్స్ జ‌ట్టు ఐపీఎల్ టైటిల్‌ను చేజార్చుకుంది. ఉత్కంఠ‌భ‌రితంగా సాగిన ఫైన‌ల్ మ్యాచ్‌లో కేవ‌లం 6 ప‌రుగుల తేడాతో ఆర్‌సీబీ చేతిలో ఓడిపోయింది. అయితే.. ఈ సారి క‌ప్పు త‌మ‌దేన‌ని అంటున్నాడు పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయ‌స్ అయ్యర్‌.

నిజం చెప్పాలంటే మా జ‌ట్టు పై ప్ర‌స్తుతం అంచ‌నాలు చాలా ఎక్కువ‌గా ఉన్నాయి. నాకు స‌వాల్ అంటే చాలా ఇష్టం. ఇంకా ముఖ్య‌మైన విష‌యం ఏమిటంటే మేం బ‌రిలోకి దిగిన ప్ర‌తిసారి గెల‌వాలి. నా దృష్టి మొత్తం ట్రోఫీ పైనే ఉంది. అని శ్రేయ‌స్ అయ్య‌ర్ శుక్ర‌వారం జ‌రిగిన జెర్సీ ఆవిష్క‌ర‌ణ కార్య‌క్ర‌మంలో అన్నాడు.

IPL 2026 : ఐపీఎల్ 2026లో ఈ ముగ్గురు విధ్వంస‌క‌ర వికెట్ కీప‌ర్ల పై ఓ క‌న్నేయాల్సిందే..!

గ‌తేడాది అక్టోబ‌ర్‌లో ఆస్ట్రేలియా ప‌ర్య‌ట‌న‌లో శ్రేయ‌స్ అయ్య‌ర్ తీవ్రంగా గాయ‌ప‌డిన సంగ‌తి తెలిసిందే. ఆసీస్‌తో జ‌రిగిన ఓ మ్యాచ్‌లో ఓ క్యాచ్‌ను అందుకునే క్ర‌మంలో అత‌డు గాయ‌ప‌డ్డాడు. అయిన‌ప్ప‌టికి కూడా అత‌డు చ‌క్క‌ని క్యాచ్ అందుకున్నాడు. నొప్పి తీవ్రంగా ఉండ‌డంతో ఆస్ప‌త్రికి త‌ర‌లించ‌గా అత‌డి ప్లీహానికి గాయ‌మైంద‌ని వైద్యులు వెల్ల‌డించారు. శ‌స్త్ర‌చికిత్స అనంత‌రం కోలుకున్నాడు.

దీనిపై అయ్య‌ర్ మాట్లాడుతూ.. గాయం నుంచి కోలుకుని తిరిగి రావ‌డం ఎప్పుడూ స‌వాలే అని అన్నాడు. ఆ స‌మ‌యంలో తాను దాదాపు ఏడు కిలోల బ‌రువు త‌గ్గిన‌ట్టుగా చెప్పుకొచ్చాడు. మ‌ళ్లీ ఆ ఏడు కిలోల బ‌రువును పెరిగేందుకు చాలా క‌ష్ట‌ప‌డ్డాన‌ని అన్నాడు. అయితే.. త‌న‌కు స‌వాళ్లు అంటే ఇష్టం అని తెలిపాడు. త‌న జీవితంలోని ఆ ద‌శ‌ను అధిగ‌మించినందుకు సంతోషంగా ఉంద‌న్నాడు.

ODI World Cup 2027 : వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ 2027 కోసం.. 20 మంది పేర్ల‌తో లిస్ట్ రెడీ చేసిన బీసీసీఐ!

ఇదిలా ఉంటే.. ఐపీఎల్ 2025 సీజ‌న్‌లో కెప్టెన్‌గానే కాకుండా ఓ బ్యాట‌ర్‌గా అయ్య‌ర్ అద్భుతంగా ఆడాడు. 50.33 స‌గ‌టు 175.07 స్ట్రైక్‌రేటుతో 604 ప‌రుగులు చేశాడు. ముఖ్యంగా క్వాలిఫ‌య‌ర్ 2లో ముంబై ఇండియ‌న్స్ పై అయ్య‌ర్ ఆడిన 87 ప‌రుగుల ఇన్నింగ్స్‌ను అభిమానులు ఎవ‌రూ కూడా అంత త్వ‌ర‌గా మ‌రిచిపోలేరు.

ఐపీఎల్ 2026లో పంజాబ్ కింగ్స్ త‌మ తొలి మ్యాచ్‌ను మార్చి 31న గుజ‌రాత్ టైటాన్స్‌తో ఆడ‌నుంది. ఈ మ్యాచ్‌కు న్యూ చండీగఢ్ ఆతిథ్యం ఇవ్వ‌నుంది.