Shubman Gill : శుభ్‌మ‌న్ గిల్ అరుదైన రికార్డు.. ఐపీఎల్ ప్లేఆఫ్స్‌లో ఏకైక కెప్టెన్‌..

రాజ‌స్థాన్ పై గుజ‌రాత్ విజ‌యం సాధించ‌డంలో ఆ జ‌ట్టు కెప్టెన్ శుభ్‌మ‌న్ గిల్ (Shubman Gill) కీల‌క పాత్ర పోషించాడు.

Shubman Gill becomes first captain to score century in IPL Playoffs (pic credit@ipl)

  • క్వాలిఫ‌య‌ర్‌-2లో రాజ‌స్థాన్ పై శ‌త‌క్కొట్టిన గుజ‌రాత్ కెప్టెన్ శుభ్‌మ‌న్ గిల్‌
  • ఐపీఎల్ ప్లేఆఫ్స్‌లో సెంచ‌రీ చేసిన ఏకైక కెప్టెన్‌గా ఘ‌న‌త

Shubman Gill : శుక్ర‌వారం రాజ‌స్థాన్ రాయ‌ల్స్‌తో జ‌రిగిన క్వాలిఫ‌య‌ర్ 2 మ్యాచ్‌లో గుజ‌రాత్ టైటాన్స్ ఏడు వికెట్ల తేడాతో విజ‌యం సాధించింది. త‌ద్వారా ఐపీఎల్ 2026 ఫైన‌ల్‌లో అడుగుపెట్టింది. కాగా.. రాజ‌స్థాన్ పై గుజ‌రాత్ విజ‌యం సాధించ‌డంలో ఆ జ‌ట్టు కెప్టెన్ శుభ్‌మ‌న్ గిల్ కీల‌క పాత్ర పోషించాడు. ఈ మ్యాచ్‌లో గిల్ శ‌త‌కంతో (53 బంతుల్లో 104 ప‌రుగులు) చెల‌రేగాడు.

ఈ క్ర‌మంలో ఐపీఎల్ ప్లేఆఫ్స్‌లో సెంచ‌రీ చేసిన తొలి కెప్టెన్‌గా శుభ్‌మ‌న్ గిల్ రికార్డుల‌కు ఎక్కాడు. ఐపీఎల్ నాకౌట్ మ్యాచ్‌ల్లో అత్య‌ధిక స్కోరు రికార్డు గ‌తంలో డేవిడ్ వార్న‌ర్‌, ర‌జ‌త్ పాటిదార్ పేరిట ఉండేది. వీరిద్ద‌రు చెరో 93 ప‌రుగులతో అజేయంగా నిలిచాడు. 2016లో క్వాలిఫ‌య‌ర్‌-2లో గుజ‌రాత్ ల‌య‌న్స్‌పై వార్న‌ర్‌, 2026లో క్వాలిఫ‌య‌ర్‌-1లో గుజ‌రాత్ టైటాన్స్ పై ర‌జ‌త్ పాటిదార్ అత్య‌ధిక ప‌రుగులు చేశారు.

Vaibhav Sooryavanshi : నేను నీకు ముందే చెప్పానుగా.. మ‌ళ్లీ అలాగే చేశావు ఏందీ.. వైభ‌వ్ సూర్య‌వంశీతో రియాన్ ప‌రాగ్.. వీడియో వైర‌ల్‌..

ఐపీఎల్ ప్లేఆఫ్స్‌లో అత్య‌ధిక స్కోర్లు చేసిన కెప్టెన్లు వీరే..

* శుభ్‌మన్ గిల్ – ఐపీఎల్ 2026 క్వాలిఫయర్ 2లో రాజస్థాన్ రాయల్స్‌పై 104 పరుగులు
* రజత్ పాటిదార్ – ఐపీఎల్ 2026 క్వాలిఫైయర్ 1లో గుజ‌రాత్ టైటాన్స్‌పై 93* పరుగులు
* డేవిడ్ వార్నర్ – ఐపీఎల్ 2016 క్వాలిఫైయర్ 2లో గుజరాత్ లయన్స్‌పై 93* పరుగులు
*శ్రేయస్ అయ్యర్ – ఐపీఎల్ 2025 క్వాలిఫయర్ 2లో ముంబై ఇండియ‌న్స్‌పై 87* పరుగులు
*ఆడమ్ గిల్ క్రిస్ట్ – ఐపీఎల్ 2009 సెమీఫైనల్‌లో ఢిల్లీ డేర్‌డెవిల్స్‌పై 85 పరుగులు

ఈ మ్యాచ్‌లో మొద‌ట బ్యాటింగ్ చేసిన ఆర్ఆర్ 20 ఓవ‌ర్ల‌లో ఆరు వికెట్ల న‌ష్టానికి 214 ప‌రుగులు చేసింది. రాజ‌స్థాన్ బ్యాట‌ర్ల‌లో వైభ‌వ్ సూర్య‌వంశీ (96; 47 బంతుల్లో 8 ఫోర్లు, 7 సిక్స‌ర్లు) తృటిలో సెంచ‌రీని చేజార్చుకున్నాడు. ర‌వీంద్ర జ‌డేజా (45; 35 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్‌), డోనోవన్ ఫెరీరా (38నాటౌట్; 11 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స‌ర్లు) లు రాణించారు. గుజ‌రాత్ బౌల‌ర్ల‌లో క‌గిసో రబాడ‌, జేస‌న్ హోల్డ‌ర్ చెరో రెండు వికెట్లు సాధించారు. సిరాజ్, ప్ర‌సిద్ధ్ కృష్ణ‌లు త‌లా ఓ వికెట్ ప‌డ‌గొట్టారు.

Vaibhav Sooryavanshi : బుడ్డోడి గుండె ప‌గిలింది.. డ‌గౌట్‌లో ఒంటరిగా కూర్చుని వెక్కి వెక్కి ఏడ్చిన వైభ‌వ్ సూర్య‌వంశీ.. ముఖం పై ట‌వల్ క‌ప్పుకుని.. వీడియో

215 ప‌రుగుల ల‌క్ష్యాన్ని గుజ‌రాత్ టైటాన్స్ 18.4 ఓవ‌ర్ల‌లో 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. గుజ‌రాత్ బ్యాట‌ర్ల‌లో శుభ్‌మ‌న్ గిల్ (104; 53 బంతుల్లో 15 ఫోర్లు, 3 సిక్స‌ర్లు) సెంచ‌రీ బాదాడు. సాయి సుద‌ర్శ‌న్ (58; 32 బంతుల్లో 8 ఫోర్లు, 1 సిక్స్‌) అర్ధ‌శ‌త‌కం బాదాడు. రాజ‌స్థాన్ బౌల‌ర్ల‌లో జోఫ్రా ఆర్చ‌ర్‌, నంద్రే బర్గర్, బ్రిజేష్ శర్మలు త‌లా ఓ వికెట్ ప‌డ‌గొట్టారు.