Sourav Ganguly : గంగూలీని గెలిపించింది నేనే.. కెప్టెన్సీ పోయేది.. దాదాపై భజ్జీ కామెంట్స్
Sourav Ganguly : టీమిండియా మాజీ కెప్టెన్, బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీపై మరో క్రికెట్ దిగ్గజం హర్భజన్ సింగ్ సంచలన కామెంట్స్ చేశాడు.
- Sreehari A
- Published on- June 6, 2022 / 02:33 PM IST
'sourav Ganguly Would Have Been Sacked From Captaincy If, Harbhajan Singh Reveals How He Saved Dada's Job
Sourav Ganguly : టీమిండియా మాజీ కెప్టెన్, బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీపై మరో క్రికెట్ దిగ్గజం హర్భజన్ సింగ్ సంచలన కామెంట్స్ చేశాడు. తన కారణంగానే ఒకప్పుడు గంగూలీ సేవ్ అయ్యాడని లేదంటే అనవసరంగా తన కెప్టెన్సీని వదులుకోవాల్సి వచ్చేదని భజ్జి వ్యాఖ్యానించాడు. అప్పుడు తాను సరిగా మ్యాచ్ ఆడటం వల్లే గంగూలీ సేఫ్ అయ్యాడని అన్నాడు.
క్రీడా ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో హర్భజన్ సింగ్ ఈ కామెంట్లు చేశాడు. గంగూలీ నాకు సపోర్టు ఇవ్వకుంటే.. 2001లో ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌లో గెలిచేవాడు కాదని చెప్పుకొచ్చాడు. ఒకవేళ ఆ మ్యాచ్ ఓడిపోతే గంగూలీ భారత క్రికెట్ జట్టు కెప్టెన్సీని కోల్పోయేవాడని తెలిపాడు. గంగూలీ తన కెరీర్‌కు దేవుడని, తన చేయి పట్టుకుని నడిపించాడని, తన కెరీర్‌కు దాదా ఎంతో సాయం చేశాడని భజ్జీ ఒక్కొక్కటిగా రివీల్ చేశాడు.
తాను కష్టాల్లో ఉన్న సమయంలో ఎంతో సపోర్టు ఇచ్చాడని తెలిపాడు. వచ్చిన ప్రతి అవకాశాన్ని తనకు ఇచ్చాడని, వాటిని సద్వినియోగపరుచుకున్నానని తెలిపాడు. లేదంటే ఆ సమయంలో గంగూలీ తన కారణంగా కెప్టెన్ కోల్పోయే పరిస్థితి వచ్చి ఉండేదని భజ్జి తెలిపాడు. 2001లో ఆస్ట్రేలియా భారత్‌లో పర్యటించింది. ముంబైలో తొలి టెస్టులో గంగూలీ సారథ్యంలోని టీమిండియా ఓటమిపాలైంది. కోల్‌కతా టెస్టులో విజయంతో పాటు చెన్నై టెస్ట్‌లోనూ సిరీస్ కైవసం చేసుకుంది.
Read Also : Sourav Ganguly: “గంగూలీ రిటైర్మెంట్ అప్పుడే కాదు”
