SA vs BAN : బంగ్లాదేశ్‌తో వన్డే సిరీస్.. 16మంది సభ్యుల సౌతాఫ్రికా జట్టు ఇదే..!

బంగ్లాదేశ్‌తో జరగనున్న 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌కు 16 మంది సభ్యులతో కూడిన సౌతాఫ్రికా జట్టును దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు ప్రకటించింది. మార్చి 18 నుంచి సిరీస్ ప్రారంభం కానుంది.

SA vs BAN : బంగ్లాదేశ్‌తో జరగనున్న మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌కు సౌతాఫ్రికా జట్టును దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు ప్రకటించింది. 16 మంది సభ్యులతో కూడిన సౌతాఫ్రికా జట్టుకు టెంబా బావుమా సారథ్యం వహించనున్నాడు. బంగ్లాదేశ్‌తో మార్చి 18 నుంచి ఈ వన్డే సిరీస్ సెంచూరియాన్‌ వేదికగా ప్రారంభం కానుంది. టెంబా బావుమా నేతృత్వంలోని ప్రోటీస్ జట్టు.. గత వన్డే సిరీస్‌లో టీమిండియాను 3-0తో వైట్‌వాష్ చేసింది. 50 ఓవర్ల ఫార్మాట్‌లో అదే జోరును కొనసాగించాలని ఉవ్విళ్లూరుతోంది. వికెట్ కీపర్-బ్యాటర్ క్వింటన్ డికాక్ ఆ సిరీస్‌లో ఆతిథ్య జట్టును ఆకట్టుకున్నాడు.

76.33 సగటుతో సెంచరీతో సహా 229 పరుగులను నమోదు చేశాడు. బంగ్లాదేశ్‌తో సిరీస్‌కు స్టార్‌ పేసర్‌ (Anrich Nortje) ఆన్రిచ్‌ నోర్జే దూరమయ్యాడు. దక్షిణాఫ్రికా పర్యటనలో భాగంగా బంగ్లాదేశ్ 3 వన్డేలు, 2 టెస్టులు ఆడనుంది. భారత్‌తో తలపడిన జట్టునే బంగ్లాదేశ్‌ సిరీస్‌కు దక్షిణాఫ్రికా క్రికెట్‌ బోర్డు ఎంపిక చేసింది. బం‍గ్లాదేశ్‌ జట్టు.. అప్ఘానిస్తాన్‌తో జరిగిన వన్డే సిరీస్‌ను 2-1 తేడాతో కైవసం చేసుకుంది. బంగ్లాదేశ్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య సిరీస్ ఓపెనర్ మ్యాచ్, చివరి మ్యాచ్ సెంచూరియన్‌లోని సూపర్‌ స్పోర్ట్ పార్క్‌లోనే జరగనుంది. జోహన్నెస్‌బర్గ్ మార్చి 20, ఆదివారం రెండో గేమ్‌కు ఆతిథ్యం ఇవ్వనుంది.

Sa Vs Ban South Africa Announce 16 Man Squad For Odi Series Against Bangladesh

బంగ్లాదేశ్ మూడు వన్డేలు, రెండు టెస్టుల కోసం దక్షిణాఫ్రికాలో పర్యటించనుంది. మూడు వన్డేల తర్వాత, రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో రెండు జట్లు తలపడనున్నాయి. మార్చి 31న ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. మొదటి మ్యాచ్ డర్బన్‌లోని కింగ్స్‌మీడ్‌లో జరుగనుంది. సిరీస్‌లోని రెండవ, చివరి మ్యాచ్ పోర్ట్ ఎలిజబెత్స్ సెయింట్ లూయిస్‌లోని జార్జ్ పార్క్‌లో జరుగనున్నాయి. బంగ్లాదేశ్ ఇటీవల ముగిసిన మూడు మ్యాచ్‌ల ODI సిరీస్‌ను అఫ్ఘానిస్తాన్‌తో 2-1 తేడాతో గెలిచింది. ఆ తర్వాత జరిగిన రెండు T20Iలలో రెండు జట్లు ఒక్కో విజయాన్ని సాధించాయి. న్యూజిలాండ్‌తో మునుపటి టెస్ట్ సిరీస్ డ్రాగా ముగిసింది. సిరీస్‌ను ప్రారంభించిన తర్వాత రెండో టెస్టు మ్యాచ్‌లో ఓడిపోయింది.

దక్షిణాఫ్రికా జట్టు: టెంబా బావుమా (కెప్టెన్), కేశవ్ మహరాజ్ (వైస్ కెప్టెన్), క్వింటన్ డి కాక్ (వికెట్ కీపర్), జుబేర్ హంజా, మార్కో జాన్సెన్, జానెమన్ మలన్, ఐడెన్ మార్క్రామ్, డేవిడ్ మిల్లర్, లుంగీ న్గిడి, వేన్ పార్నెల్, ఆండిలే ఫెహ్లుక్వాయో, ద్వాహ్లుక్వాయో, కగిసో రబడ, తబ్రైజ్ షమ్సీ, రాస్సీ వాన్ డెర్ డుసెన్, కైల్ వెర్రెయిన్

Read Also : Virat Kohli: కోహ్లీ వందో టెస్టు.. విషెస్ తెలిపిన క్రికెట్ లెజెండ్స్

ట్రెండింగ్ వార్తలు