PIC Credit: @ProteasMenCSA (X)
T20 World Cup 2026: టీ20 ప్రపంచ కప్‌లో భాగంగా దక్షిణాఫ్రికా, అఫ్ఘానిస్థాన్ మధ్య ఇవాళ మ్యాచ్ జరిగింది. చివరలో నరాలు తెగే ఉత్కంఠభరిత క్షణాలను ఎక్స్‌పీరియన్స్ చేశారు ఫ్యాన్స్. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచులో దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేయగా, అఫ్ఘానిస్థాన్ 19.4 ఓవర్లలో 187 పరుగులు చేసి ఆలౌట్ అయింది.
Also Read: T20 World Cup : టీ20 వరల్డ్‌కప్ వేళ భారత జట్టుకు బిగ్‌షాక్.. ఆస్పత్రి పాలైన స్టార్ ప్లేయర్..
దీంతో సూపర్ ఓవర్ నిర్వహించగా అది కూడా డ్రా అయింది. ఇరు జట్లు 17 పరుగులు చేశాయి. రెండో సూపర్ ఓవర్ నిర్వహించారు. ఇందులో దక్షిణాఫ్రికా 23 పరుగులు బాదింది. రెండో సూపర్ ఓవర్‌లో అఫ్ఘాన్ 19 పరుగులు మాత్రమే చేసింది. దీంతో దక్షిణాఫ్రికా 4 పరుగుల తేడాతో గెలిచింది.
మ్యాచ్ జరిగిన తీరు..
దక్షిణాఫ్రికా స్కోరు
నిర్ణీత 20 ఓవర్లలో 187/6
మొదటి సూపర్ ఓవర్ – 1 ఓవర్‌లో 17/1
రెండో సూపర్ ఓవర్ – 1 ఓవర్‌లో 23/0
అఫ్ఘానిస్థాన్ స్కోరు
19.4 ఓవర్లు – 187 ఆలౌట్
మొదటి సూపర్ ఓవర్ – 1 ఓవర్‌లో 17/0
రెండో సూపర్ ఓవర్ – 1 ఓవర్‌లో 19/2
ఫలితం
రెండో సూపర్ ఓవర్‌లో దక్షిణాఫ్రికా 4 పరుగుల తేడాతో విజయం
An instant #T20WorldCup classic sees South Africa beat Afghanistan in a double Super Over thriller 🤯
📝: https://t.co/imSDJnHAdr pic.twitter.com/qj0IhYkAOm
— ICC (@ICC) February 11, 2026