బెంగళూరు VS హైదరాబాద్.. ఉప్పల్ స్టేడియం రెడీ.. కోహ్లీ నినాదాలతో హోరెత్తించిన ఫ్యాన్స్
ఉప్పల్ స్టేడియం పరిసర ప్రాంతంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. గురువారం జరిగే మ్యాచు కోసం..
- T Venkateshwarlu
- Updated on- April 24, 2024 / 07:10 PM IST
@CricCrazyJohns
మరో ఐపీఎల్ మ్యాచ్కి ఉప్పల్ స్టేడియం సర్వం సిద్ధమైంది. ఇప్పటికే హైదరాబాద్, ఉప్పల్ స్టేడియంలో గత నెల 27న ముంబై, హైదరాబాద్ మధ్య, ఏప్రిల్ 5న చెన్నై, హైదరాబాద్ మధ్య మ్యాచులు జరిగాయి. గురువారం బెంగుళూరు, హైదరాబాద్ మధ్య మ్యాచ్ జరుగుతుంది.
ఉప్పల్ స్టేడియానికి ఇరు జట్లు చేరుకున్నాయి. స్టేడియంలో ఆర్సీబీ, సన్రైజర్స్ హైదరాబాద్ క్రికెటర్లు ప్రాక్టీస్ చేస్తున్నారు. కోహ్లీ వచ్చిన వేళ ఫ్యాన్స్ కోహ్లీ కోహ్లీ అంటూ నినాదాలతో మార్మోగించారు ఫ్యాన్స్. కాగా, 2,500 మందితో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఉప్పల్ స్టేడియం పరిసర ప్రాంతంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. గురువారం జరిగే మ్యాచు కోసం ఆర్టీసీ, మెట్రో రైల్ ప్రత్యేక సర్వీసులు నడుపుతున్నాయి.
ఉప్పల్ స్టేడియంలో మిగిలిన మ్యాచులు
- మే 2న రాజస్థాన్ vs హైదరాబాద్
- మే 8న లక్నో vs హైదరాబాద్
- మే 16న గుజరాత్ vs హైదరాబాద్
- మే 19న పంజాబ్ vs హైదరాబాద్
పాయింట్ల పట్టిక
| ర్యాంకు | జట్లు | మ్యాచులు | గెలుపు | ఓటమి | పాయింట్లు | ||
| 1 | రాజస్థాన్ | 8 | 7 | 1 | 14 | ||
| 2 | కోల్కతా | 7 | 5 | 2 | 10 | ||
| 3 | హైదరాబాద్ | 7 | 5 | 2 | 10 | ||
| 4 | లక్నో | 8 | 5 | 3 | 10 | ||
| 5 | చెన్నై | 8 | 4 | 4 | 8 | ||
| 6 | గుజరాత్ | 8 | 4 | 4 | 8 | ||
| 7 | ముంబై | 8 | 3 | 5 | 6 | ||
| 8 | ఢిల్లీ | 8 | 3 | 5 | 6 | ||
| 9 | పంజాబ్ | 8 | 2 | 6 | 4 | ||
| 10 | బెంగళూరు | 8 | 1 | 7 | 2 |
Also Read : ఢిల్లీతో గుజరాత్ మ్యాచ్.. సెంచరీ కొట్టనున్న గిల్
