IPL 2021 : సన్ రైజర్స్ పై ముంబై ఘనవిజయం
ముంబై ఇండియన్స్ - సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య జరిగిన ఐపీఎల్ 20 మ్యాచ్ లో ముంబై జట్టు గణ విజయం సాధించింది.
- kunduru Vinod
- Published On : October 8, 2021 / 11:28 PM IST
Ipl 2021 (2)
IPL 2021 : ముంబై ఇండియన్స్ – సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య జరిగిన ఐపీఎల్ 20 మ్యాచ్ లో ముంబై జట్టు ఘనవిజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై భారీ స్కోరు చేసింది. ఓపెనర్ ఇషాన్ కిషన్ చెలరేగడంతో జట్టు 10 ఓవర్లలోనే 130 పరుగులు చేసింది. ఇక ఆ తర్వాత సూర్యకుమార్ విధ్వంసకర బ్యాటింగ్ తో జట్టు స్కోరును పరుగులు పెట్టించాడు. దీంతో 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 235 పరుగులు చేసింది ముంబై జట్టు.
అనంతరం భారీ లక్ష్యంతో బ్యాటింగ్ కి దిగిన సన్ రైజర్స్ ఓపెనర్లు అద్భుత ప్రదర్శన కనబరిచాడు. ఏడు ఓవర్లలోనే 70 పరుగులు దాటించారు. ఇదే సమయంలో ఓపెనర్ జాసన్ రాయ్ 34 పరుగులు , అభిషేక్ శర్మ 33 పరుగుల వద్ద క్యాచ్ అవుట్ అయ్యారు. అనంతరం బ్యాటింగ్ కి వచ్చిన మనీష్ పాండే దూకుడు కొనసాగించాడు. అయితే అతడికి సరైన జోడి లేకపోవడంతో ఒంటరిపోరాటం చెయ్యాల్సి వచ్చింది. 41 బంతుల్లో 69 పరుగులు చేశాడు మనీష్ పాండే. మిగతా బ్యాటర్లు పెద్దగా రానించలేకపోయారు. హైదరాబాద్ జట్టు 20 ఓవర్లో 8 వికెట్లు కోల్పోయి 193 పరుగులు చేసింది. దీంతో ముంబై జట్టు 42 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది.
ముంబై బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా నాలుగు ఓవర్లు వేసి 39 పరుగులిచ్చి రెండు వికెట్లు తీయగా మరో బౌలర్ జేమ్స్ నీషామ్ 3 ఓవర్లు వేసి 28 పరుగులిచ్చి రెండు వికెట్లు తీశారు.
