Sunrisers Hyderabad : జాక్ ఎడ్వర్డ్స్ స్థానంలో 300 వికెట్ల వీరుడు.. సన్‌రైజర్స్ స్కెచ్ మామూలుగా లేదుగా
ఐపీఎల్ 2026కి ముందు సన్‌రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad) కీలక నిర్ణయం తీసుకుంది.
- Thota Vamshi Kumar
- Published on- March 24, 2026 / 02:39 PM IST
Sunrisers Hyderabad announces David Payne as Jack Edwards replacement for IPL 2026
- ఐపీఎల్ 2026 సీజన్‌కు దూరమైన జాక్ ఎడ్వర్డ్స్
- అతడి స్థానంలో డేవిడ్ పేన్ తీసుకున్న ఎస్ఆర్‌హెచ్
Sunrisers Hyderabad : ఐపీఎల్ 2026కి ముందు సన్‌రైజర్స్ హైదరాబాద్ కీలక నిర్ణయం తీసుకుంది. గాయంతో ఈ సీజన్ ప్రారంభానికి ముందే తప్పుకున్న ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ జాక్ ఎడ్వర్డ్స్ స్థానంలో మరో పేసర్‌ను తీసుకుంది. ఎడ్వర్డ్స్ స్థానంలో ఇంగ్లాండ్ సీనియర్ బౌలర్ డేవిడ్ పేన్ ను తీసుకుంది. ఈ విషయాన్ని సన్‌రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad) సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది.
35 ఏళ్ల డేవిడ్ ను సన్‌రైజర్స్ 1.5 కోట్లకు దక్కించుకుంది. ఇంగ్లాండ్ తరుపున డేవిడ్ కేవలం ఒకే ఒక వన్డే మ్యాచ్ ఆడాడు. అయితే.. టీ20 ఫార్మాట్‌లో అతడికి అపారమైన అనుభవం ఉంది. 233 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. 8.03 ఎకానమీతో 304 వికెట్లు పడగొట్టాడు.
Rinku Singh : రింకూ సింగ్‌కు ప్రభుత్వ ఉద్యోగం!
ఇటీవల బిగ్ బాష్ లీగ్‌లోనూ డేవిడ్ అద్భుతమైన ప్రదర్శన చేశాడు. ఆరు మ్యాచ్‌ల్లో 11 వికెట్లు పడగొట్టి తన జట్టు పెర్త్ స్కార్చర్స్ టైటిల్ అందుకోవడంలో కీలక పాత్ర పోషించాడు. ఫైనల్ మ్యాచ్‌లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును సైతం అందుకున్నాడు. తన నాలుగు ఓవర్ల కోటాలో 18 పరుగులు మాత్రమే ఇచ్చి మూడు వికెట్లు తీశాడు.
ఇదిలా ఉంటే.. ఐపీఎల్ 2026 మార్చి 28న ప్రారంభం కానుంది. కాగా.. ఆరంభ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుతో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు తలపడనుంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం ఈ మ్యాచ్‌కు ఆతిథ్యం ఇవ్వనుంది.
