SunRisers Hyderabad : అక్కడ రెండు టైటిల్స్ గెలిచిన జెర్సీతో ఐపీఎల్లో సన్‌రైజర్స్.. నెట్టింట సెటైర్లు!
ఐపీఎల్ 2024 సీజన్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ కొత్త జెర్సీతో బరిలోకి దిగనున్నట్లు వెల్లడించింది.
- Thota Vamshi Kumar
- Updated on- March 8, 2024 / 01:22 PM IST
Sunrisers Hyderabad unveils fiery new jersey for IPL 2024 season
SRH new jersey : క్రికెట్ ప్రేమికులను అలరించేందుకు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2024 సీజన్ మరికొద్ది రోజుల్లో ఆరంభం కానుంది. మార్చి 22 నుంచి ప్రారంభం కానున్న ఈ సీజన్ కోసం అన్ని ప్రాంఛైజీలు సిద్ధమవుతున్నాయి. గత కొన్ని సీజన్లుగా పేలవ ప్రదర్శన చేస్తున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ ఈ సీజన్లో రాణించాలని పట్టుదలగా ఉంది. ఈ క్రమంలోనే మార్క్రమ్ను కెప్టెన్‌గా తొలగించి అతడి స్థానంలో ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ పాట్ కమిన్స్ కు నాయకత్వ బాధ్యతలు అప్పగించింది. అంతేకాదండోయ్ ఈ సీజన్లో కొత్త జెర్సీతో బరిలోకి దిగనున్నట్లు వెల్లడించింది.
దక్షిణాఫ్రికా టీ20 లీగ్‌లో తమ ప్రాంచైజీ చెందిన సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ జెర్సీనే ఐపీఎల్‌లోనూ కొనసాగించాలని నిర్ణయించింది. జెర్సీతో పాటు కిట్ మొత్తాన్ని ఐపీఎల్లో ఉపయోగించనుంది. కొత్త జెర్సీకి సంబంధించిన ఫోటోను విడుదల చేసింది. టీమ్ఇండియా సీనియర్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ కొత్త జెర్సీని ధరించిన ఫోటోలను అభిమానులతో పంచుకుంది. నల్లని చారలను జిగ్ జాగ్ గా ప్రింట్ చేసిన ఆరెంజ్ కలర్ జెర్సీ ఇది.
Shubman Gill : బౌండరీతో గిల్ సెంచరీ.. అతడి తండ్రి ఇచ్చిన రియాక్షన్ వైరల్.. వీడియో
అచ్చొచ్చిన జెర్సీ..
సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ ఈ జెర్సీనే ధరిస్తోంది. మార్క్రమ్ సారథ్యంలో ఈ జట్టు రెండు సార్లు ఎస్ఏ టీ20 లీగ్ విజేతగా నిలిచింది. దీంతో అక్కడ కలిసొచ్చిన జెర్సీతోనైనా ఐపీఎల్లో తమ తలరాత మారకపోతుందా అని ఎస్ఆర్హెచ్ మేనేజ్మెంట్ భావిస్తోంది. అయితే.. దీనిపై నెటింట్ట భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. జెర్సీలు మారిస్తే టైటిళ్లు రావని, మంచి కోర్ టీమ్‌పై ఫోకస్ పెట్టాలని అంటున్నారు. ఎస్ఏటీ20 జెర్సీ కావాలి గానీ, మార్క్రమ్ కెప్టెన్సీ వద్దా? ఇదేం నాయ్యం అంటూ కామెంట్లు పెడుతున్నారు.
ఐపీఎల్ 2024 సీజన్లో సన్ రైజర్స్ హైదరాబాద్ తన తొలి మ్యాచ్‌ను మార్చి 23న కేకేఆర్‌తో ఆడనుంది.
Rohit Sharma : శతక్కొట్టిన రోహిత్ శర్మ.. సెంచరీ నంబర్ 48.. జోరూట్ రికార్డ్ బ్రేక్..
