Suresh Raina: పుష్ప క్రేజ్.. తగ్గేదే లే.. క్రికెటర్ సురేష్ రైనా స్టెప్పులు

పాన్ ఇండియా మూవీగా రిలీజైన పుష్ప బాలీవుడ్‌లో క్రేజీ సినిమాగా మారిపోయింది.

Suresh Raina: పాన్ ఇండియా మూవీగా రిలీజైన పుష్ప బాలీవుడ్‌లో క్రేజీ సినిమాగా మారిపోయింది. తగ్గేదే లే అంటూ కలెక్షన్లు రాబట్టుకున్న ఈ సినిమాను సెలబ్రిటీలు తెగ ఎంజాయ్ చేస్తున్నారు. ఇప్పటికే పలువురు క్రికెటర్లు ఈ సినిమాలో తగ్గేదే లే అనే డైలాగ్‌ను క్రికెటర్లు, బాలీవుడ్ సెలబ్రిటీలు వైరల్ చేస్తున్నారు.

ఆస్ట్రేలియా స్టార్‌ క్రికెటర్ డేవిడ్‌ వార్నర్‌, భారత క్రికెటర్లు శిఖర్‌ ధవన్‌, రవీంద్ర జడేజా, సూర్యకుమార్‌ యాదవ్‌, ఇషాన్‌ కిషన్‌లు తగ్గేదేలే అంటూ పుష్ప సినిమా పాటలు, డైలాగులతో ఇరగదీశారు.

ఈ క్రమంలోనే లేటెస్ట్‌గా సురేష్ రైనా కూడా ఈ సినిమాలోని సూపర్‌ హిట్‌ సాంగ్‌ “చూపే బంగారమాయనే శ్రీవల్లి..” అంటూ సాగే పాటకు స్టెప్పులేసి అదరగొట్టేశాడు. రైనాతో కుటుంబ సభ్యులతో కలిసి పాటకు స్టెప్పులేశాడు.

దీనికి సంబంధించిన వీడియోను రైనా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేస్తూ.. బన్నీపై ప్రశంసలు కురిపించాడు. పుష్ప సినిమాను చూశాన‌ని, అందులో అల్లు అర్జున్ న‌ట‌న అద్భుంతంగా ఉందన్నాడు.

రైనా ప్రస్తుతం అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికి కేవలం ఐపీఎల్‌లో ఆడుతున్నారు. గతేడాది వరకు సీఎస్‌కే తరపున రైనా ఆడగా.. అతన్ని రీటైన్ చేసుకోలేదు ఆ జట్టు.

ట్రెండింగ్ వార్తలు