Agnes Tirop : కెన్యా అథ్లెట్ అగ్నెస్ అనుమానాస్పద మృతి
కెన్యా వరల్డ్ రికార్డ్ హోల్డర్ ఆగ్నెస్ టిరోప్ పశ్చిమ పట్టణం ఐటెన్‌లోని ఆమె ఇంట్లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు.
- kunduru Vinod
- Published On : October 14, 2021 / 07:59 AM IST
Agnes Tirop
Agnes Tirop : కెన్యా వరల్డ్ రికార్డ్ హోల్డర్ ఆగ్నెస్ టిరోప్ పశ్చిమ పట్టణం ఐటెన్‌లోని ఆమె ఇంట్లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఆమె శరీరంపై కత్తిపోట్లు ఉండటంతో పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు. హత్యకు భర్తే కారణమని అనుమానిస్తున్నారు పోలీసులు. మంగళవారం రాత్రి సమయంలో ఆగ్నెస్ టిరోప్ హత్యకు గురైనట్లు నిర్దారణకు వచ్చారు పోలీసులు. ఇక అదే సమయంలో ఆమె భర్త కనిపించకపోవడంతో అతడిపైనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
చదవండి : మానవాళికి ముంచుకొస్తున్న మరో ముప్పు
కాగా హత్య జరిగిన రోజు రాత్రి నుంచి ఆగ్నెస్ టిరోప్ తండ్రి కూడా తప్పిపోయినట్లు పోలీసులు గుర్తించారు. ఆగ్నెస్ టిరోప్ మృతదేహాన్ని పోలీసులు బెడ్ కింద గుర్తించారు. ఆపై కత్తిగాట్లు ఉండటంతో హత్యగా నిర్దారణకు వచ్చారు. ఇంట్లోని సీసీటీవీ కెమెరాలను పరిశీలిస్తున్నారు పోలీసులు. కాగా ఈమె ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లలో (2017, 2019) పది వేల మీటర్ల విభాగంలో రెండు కాంస్య పతకాలు గెలిచారు. తాజాగా టోక్యో ఒలింపిక్స్‌లో 5000 మీటర్ల పరుగులో నాలుగో స్థానంలో నిలిచింది.
చదవండి : ప్రాణహాని ఉందని ఫిర్యాదు చేసిన పట్టించుకోని ఎస్ఐ.. సస్పెండ్ చేసిన సీపీ
