Andrew Flintoff : సిడ్నీ థండ‌ర్ హెడ్ కోచ్‌గా ఆండ్రూ ఫ్లింటాఫ్..

సిడ్నీ థండ‌ర్ త‌మ జ‌ట్టు హెచ్ కోచ్‌గా ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ ఆండ్రూ ఫ్లింటాఫ్ ను (Andrew Flintoff) నియ‌మించింది.

Sydney Thunder announces appointment of Andrew Flintoff as head coach

  • రాబోయే బిగ్‌బాష్ లీగ్‌కు ముందు సిడ్నీ థండ‌ర్ కీల‌క నిర్ణ‌యం
  • హెడ్ కోచ్‌గా ఆండ్రూ ఫ్లింటాఫ్ నియామ‌కం

Andrew Flintoff : రాబోయే బిగ్ బాష్ లీగ్‌కు ముందు సిడ్నీ థండ‌ర్ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. త‌మ జ‌ట్టు హెచ్ కోచ్‌గా ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ ఆండ్రూ ఫ్లింటాఫ్ ను నియ‌మించింది. ట్రైవ‌ర్ బేలిస్ స్థానంలో అత‌డు బాధ్య‌త‌లు చేప‌ట్ట‌నున్నాడు. కాగా.. ఫ్లింటాఫ్ల్ విదేశీ లీగ్‌లో ఓ జ‌ట్టుకు కోచ్‌గా వ్య‌వ‌హ‌రించ‌నుండ‌డం ఇదే తొలిసారి.

ఇంగ్లాండ్‌కు చెందిన ది హండ్రెడ్‌లో నార్తర్న్ సూపర్‌చార్జర్స్ కు ఫ్లింటాఫ్ హెడ్ కోచ్‌గా ఉన్నాడు. అత‌డి మార్గ‌నిర్దేశంలో నార్త‌ర్న్ జ‌ట్టు అట్టడుగు స్థానం నుంచి రెండు సార్లు టాప్-4లో నిలిచింది. అంతేకాదు.. ఇంగ్లాండ్ పరిమిత ఓవ‌ర్ల జ‌ట్టుకు 2023-24 సీజ‌న్‌కు క‌న్స‌ల్టెంట్‌గా ప‌ని చేశాడు. ఇంగ్లాండ్ ల‌య‌న్స్‌కు మార్గ‌నిర్దేశం చేశాడు.

IPL Trophy : రెండు లేదా అంత‌కంటే ఎక్కువ ఫైన‌ల్స్ ఆడిన‌ప్ప‌టికి ఐపీఎల్ ట్రోఫీని గెల‌వ‌ని వారు వీరే.. లిస్ట్ చాలా పెద్ద‌దే.. హేమాహేమీలు కూడా..

ఇంగ్లాండ్ క్రికెట్‌లో అత్యుత్త‌మ ఆల్‌రౌండ‌ర్ల‌లో ఒక‌డిగా పేరు తెచ్చుకున్నాడు ఆండ్రూ ఫ్లింటాఫ్. ఇంగ్లాండ్ త‌రుపున 1998 నుంచి 2010 వ‌ర‌కు ఆడాడు. 79 టెస్టులు, 141 వ‌న్డేలు, 7 టీ20ల్లో ఇంగ్లాండ్‌కు ఆడిన ఫ్లింటాఫ్.. టెస్టుల్లో 3845 ప‌రుగులు చేయ‌డంతో పాటు 226 వికెట్లు, వ‌న్డేల్లో 3394 ప‌రుగులు చేయ‌డంతో పాటు 169 వికెట్లు, టీ20ల్లో 76 ప‌రుగులు చేయ‌డంతో పాటు 5 వికెట్లు తీశాడు.

RCB Prize Money : 20 కోట్ల ప్రైజ్‌మ‌నీని ఆర్‌సీబీ ఆట‌గాళ్లు ఎలా పంచుకుంటారు? భువ‌నేశ్వ‌ర్ కుమార్ ఏమ‌న్నాడంటే..?

ఇదిలా ఉంటే.. సిడ్నీ థండ‌ర్ హెడ్ కోచ్‌గా నియ‌మితుడు కావ‌డం పట్ల ఆండ్రూ ఫ్లింటాఫ్ల్ స్పందించాడు. త‌న ప‌నిని ప్రారంభించ‌డానికి ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నాన‌ని చెప్పుకొచ్చాడు. జ‌ట్టును మ‌రింత అభివృద్ధి ప‌య‌నంలో న‌డిపించేందుకు త‌న శ‌క్తి వంచ‌న లేకుండా కృషి చేస్తాన‌ని తెలిపాడు.