×
Ad

AUS vs ZIM : బ్రియాన్ బెన్నెట్ హాఫ్ సెంచ‌రీ.. ఆసీస్ టార్గెట్ ఎంతంటే?

టీ20 ప్ర‌పంచ‌కప్ 2026లో ఆస్ట్రేలియా ముందు జింబాబ్వే (AUS vs ZIM ) ఓ మోస్త‌రు టార్గెట్ ఉంచింది.

T20 World Cup 2026 AUS vs ZIM Brian Bennett half century australia target 170

AUS vs ZIM : టీ20 ప్ర‌పంచ‌కప్ 2026లో భాగంగా కొలంబోని ప్రేమదాస స్టేడియం వేదిక‌గా జింబాబ్వే, ఆస్ట్రేలియా జ‌ట్ల మ‌ధ్య మ్యాచ్ జ‌రుగుతోంది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన జింబాబ్వే నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో రెండు వికెట్లు కోల్పోయి 169 ప‌రుగులు చేసింది. దీంతో ఆసీస్ ముందు 170 ప‌రుగుల ల‌క్ష్యం నిలిచింది.

జింబాబ్వే బ్యాట‌ర్ల‌లో ఓపెన‌ర్ బ్రియాన్ బెన్నెట్( 64 నాటౌట్; 56 బంతుల్లో 7 ఫోర్లు) హాఫ్ సెంచ‌రీతో చెల‌రేగాడు. తడివానాషే మరుమాని (35; 21 బంతుల్లో 7 ఫోర్లు), ర్యాన్ బర్ల్ (35; 30 బంతుల్లో 4 ఫోర్లు), కెప్టెన్ సికింద‌ర్ రజా (19 నాటౌట్; 12 బంతుల్లో 2 ఫోర్లు) రాణించారు. ఆసీస్ బౌల‌ర్ల‌లో మార్క‌స్ స్టోయినిస్‌, కామెరూన్ గ్రీన్ త‌లా చెరో వికెట్ సాధించారు.