×
Ad

T20 World Cup 2026 : టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కెన‌డా.. కీల‌క మ్యాచ్‌కు కివీస్ కెప్టెన్ దూరం.. సార‌థి ఎవ‌రంటే ?

టీ20 ప్ర‌పంచ‌క‌ప్ 2026లో (T20 World Cup 2026) భాగంగా చెన్నైలోని చిదంబ‌రం స్టేడియం వేదిక‌గా కెన‌డా, న్యూజ‌లాండ్ జ‌ట్ల మ‌ధ్య మ్యాచ్ జ‌రుగుతోంది.

T20 World Cup 2026 Canada opt to bat against New Zealand

T20 World Cup 2026 : టీ20 ప్ర‌పంచ‌క‌ప్ 2026లో భాగంగా చెన్నైలోని చిదంబ‌రం స్టేడియం వేదిక‌గా కెన‌డా, న్యూజ‌లాండ్ జ‌ట్ల మ‌ధ్య మ్యాచ్ జ‌రుగుతోంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన కెన‌డా బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో న్యూజిలాండ్ తొలుత ఫీల్డింగ్ చేయ‌నుంది. ఇక ఈ మ్యాచ్‌లో గెలిస్తే న్యూజిలాండ్ సూప‌ర్‌-8కి అర్హ‌త సాధిస్తుంది.

ఇదిలా ఉంటే.. ఈ కీల‌క మ్యాచ్‌కు కివీస్ రెగ్యుల‌ర్ కెప్టెన్ మిచెల్ సాంట్న‌ర్ దూరం అయ్యాడు. అత‌డి స్థానంలో డారిల్ మిచెల్ తాత్కాలిక సార‌థిగా వ్య‌వ‌హ‌రిస్తున్నాడు.

‘పిచ్ చాలా బాగుంది. మేము ముందుగా బ్యాటింగ్ చేస్తాం. మ్యాచ్ సాగే కొద్ది స్పిన్న‌ర్లు ప్ర‌భావం చూపొచ్చు. కాబ‌ట్టి స్కోరు బోర్డు పై భారీ ప‌రుగులు సాధించి ప్ర‌త్య‌ర్థిని ఒత్తిడిలోకి నెడ‌తాము. మేము రెండు డే అండ్ నైట్ మ్యాచ్‌లు ఆడాము. ఇప్పుడు డే మ్యాచ్ ఆడ‌డం బాగుంది. మా స్పిన్న‌ర్ల‌కు ఇది స‌రిపోతుంది. తుది జ‌ట్టులో ఓ మార్పు చోటు చేసుకుంది. క‌లీమ్ స‌నా గాయంతో బాధ‌ప‌డుతున్నాడు. అత‌డి స్థానంలో శివం శ‌ర్మ జ‌ట్టులోకి వ‌చ్చాడు.’ అని కెన‌డా కెప్టెన్ దిల్‌ప్రీత్ బజ్వా అన్నాడు.

T20 World Cup 2026 : శ్రీలంక చేతిలో అందుకే ఓడిపోయాం.. ఇక ఐర్లాండే మాకు దిక్కు.. ఆసీస్ కెప్టెన్ మిచెల్ మార్ష్ కామెంట్స్‌..

‘మిచెల్ సాంట్న‌ర్ అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్నాడు. అందుక‌నే అత‌డు ఈ మ్యాచ్‌లో ఆడ‌డం లేదు. అత‌డి స్థానంలో కోల్ మెక్‌కాంచీ జ‌ట్టులోకి వ‌చ్చాడు. తొలి సంతానం జ‌న్మించ‌డంతో లాకీ ఆడ‌డం లేదు. త్వ‌ర‌లోనే అత‌డు జ‌ట్టుతో చేర‌తాడు. అత‌డి స్థానంలో కైల్ జామీస‌న్ ఆడ‌తాడు. గ‌త కొన్నేళ్లుగా చెన్నై పిచ్ పై మా జ‌ట్టులో చాలా మంది ఆడారు. కాబ‌ట్టి ఇక్క‌డి ప‌రిస్థితుల‌పై అవ‌గాహ‌న ఉంది. ‘అని తాత్కాలిక సార‌థి డారిల్ మిచెల్ అన్నాడు.

కెన‌డా తుది జ‌ట్టు..

యువరాజ్ సమ్రా, దిల్‌ప్రీత్ బజ్వా(కెప్టెన్‌), నవనీత్ ధలివాల్, హర్ష్ థాకర్, నికోలస్ కిర్టన్, శ్రేయాస్ మొవ్వ(వికెట్ కీప‌ర్‌), సాద్ బిన్ జాఫర్, శివమ్ శర్మ, దిలోన్ హేలిగర్, జస్కరన్ సింగ్, అన్ష్ పటేల్

T20 World Cup 2026 : శ్రీలంక చేతిలో ఓడిపోయినా.. సూప‌ర్‌-8కు అర్హ‌త సాధించేందుకు ఆస్ట్రేలియాకు మిగిలి ఉన్న ఏకైక దారి ఇదే?

న్యూజిలాండ్ తుది జ‌ట్టు..

టిమ్ సీఫెర్ట్(వికెట్ కీప‌ర్‌), ఫిన్ అల్లెన్, రాచిన్ రవీంద్ర, గ్లెన్ ఫిలిప్స్, మార్క్ చాప్‌మన్, డారిల్ మిచెల్(కెప్టెన్‌), కోల్ మెక్‌కాంచీ, జేమ్స్ నీషమ్, కైల్ జామిసన్, మాట్ హెన్రీ, జాకబ్ డఫీ.